నిద్రకు కోటా?!

17 Sep, 2017 16:49 IST|Sakshi
నిద్రకు కోటా?!

సాక్షి, న్యూఢిల్లీ : ఇది నా బెర్తు.. నా ఇష్టం.. ఎన్ని గంటలైనా నిద్రపోతా.. అయినా అడిగేందుకు మీరెవరూ? అనే ప్రశ్నలు, మాటలు ఇక కదరదు. ఎందుకంటే.. రిజర్వేషన్‌కు, బెర్తులకు ఉన్నట్లే నిద్రకూడా కోటా విధించింది రైల్వేశాఖ. లోయర్‌, మిడిల్‌ బెర్తులు దక్కించుకున్న ప్రయాణికులు జర్నీలో అధిక సమయం నిద్ర పోతుండడం వల్ల పలు ఫిర్యాదులు రైల్వే శాఖకు అందాయి. మరీ ముఖ్యంగా పగటివేళలో కూడా ప్రయాణికులు బెర్తులు కిందకు దించి నిద్రించడం వల్ల ఆర్‌ఏసీ ప్రయాణికుల సీట్లు లభించడం లేదని కొంతకాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి పరిష్కారంగా రైల్వే శాఖ తాజా ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యురల్‌లో ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి.. ఉదయం 6 గంటల వరకూ బెర్తుల మీద నిద్రించేందుకు అవకాశం కల్పించింది. ఇతర ప్రయాణికుల నుంచి వ్యతిరేకత లేకపోతే .. రాత్రి 9 గంటలకే పడుకోవచ్చని అందులో రైల్వే శాఖ పేర్కొంది.

రైల్వే శాఖ తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌ని ఇండియన్‌ రైల్వేస్‌ కమర్షియల్‌ మాన్యువల్‌ వాల్యుమ్‌ -1 లో 652వ పేరాలో చేరుస్తున్నట్లు రైల్వే బోర్డు సభ్యుడు, ప్యాసెంజర్‌ మార్కెటింగ్‌  డైరెక్టర్‌ విక్రమ్‌ సింగ్‌ ప్రకటించారు.


 

మరిన్ని వార్తలు