రైళ్లలో కొత్త విధానం; రూ. 800 కోట్లు ఆదా

17 Sep, 2019 18:59 IST|Sakshi

న్యూఢిల్లీ : రైల్వే వ్యవస్థలో మరింత ఆక్యుపెన్సీ పెంచేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైల్వే కష్టాలనుంచి బయటపడేందుకు  యోచిస్తోంది. రైళ్లలో అదనపు బెర్తులను నిర్మించడం కోసం దేశంలో నడుస్తున్న 500 రైళ్ల నుంచి జనరేటర్‌ కార్లను తొలగించాలని భారత రైల్వే నిర్ణయించింది. వీటి స్థానంలో మరో 20 వేల కొత్త బెర్తులను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల రైల్వేకు సంవత్సరానికి దాదాపు రూ. 800 కోట్లు ఆదా కానుంది. 

ప్రస్తుతం 500లకు పైగా రైళ్లలోని జనరేటర్‌ కార్లను దశల వారీగా తొలగించాలని నిర్ణయించింది. ఇలా తొలగించడం వల్ల ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. భారతీయ రైల్వే తన బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో 100 శాతం విద్యుదీకరణ కోసం ఒక ప్రధాన విద్యుత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనివల్ల ఇంతకముందు రైళ్లలో ఉన్న ఎలక్ట్రికల్‌ పరికరాల (ఫ్యాన్లు, లైట్లు) స్థానాలలో ప్రయాణీకుల కోచ్‌లతో భర్తీ చేయాలనేది ప్రణాళిక. రైళ్లలో పవర్ కోచ్‌లకు బదులుగా రెండు, మూడు అంచెల కోచ్‌లను జోడిస్తే,  దాదాపు 144 బెర్తులు నిర్మించడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న మరిన్ని టిక్కెట్లను ప్రయాణీకులకు అందించవచ్చు. కాగా ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే ఇటీవల ప్రధాన స్టేషన్లలో లిఫ్టులు,ఎస్కలేటర్లు, గృహ నిర్వాహక సదుపాయాలు వంటి అనేక చర్యలు తీసుకున్నవిషయం తెలిసిందే

మరిన్ని వార్తలు