-

జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?

22 Mar, 2020 07:21 IST|Sakshi

ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే 

జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం 

లేకుంటే మూడో దశలో అల్లకల్లోం

సాక్షి, చిత్తూరు: కరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినోటా ఇప్పుడు వినిపిస్తున్న పదం. ఈ వైరస్‌ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఇంత వరకు టీకాలు కనిపెట్టలేదు. ఇలాంటి తరుణంలో కరోనాను నిలవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలు ఆదివారం పూర్తిగా జనతా కర్ఫ్యూలోకి వెళ్లడానికి అన్నివిధాలుగా సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకూ ఆ 14 గంటలు ఏం జరగబోతుంది..? బయటకొస్తే ఏమవుతుంది..? ఎందుకు 14 గంటలు ఇంట్లోనే ఉండాలి..? అందరూ అనుకుంటున్నట్లు హెలికాప్టర్ల ద్వారా ఆకాశంలో క్రిమిసంహార మందులు చల్లుతున్నారా..? అందుకే బయటకు రావొద్దంటున్నారా..? అబ్బో అందరి మదిని తొలిచివేస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానాలు కూడా ఉన్నాయి. మీరే చదవండి... 

ఆ 14 గంటలు ఎందుకంటే... 
మనిషి సగటు జీవితకాం 80 ఏళ్లు. ఏనుగు 70 ఏళ్లు. ఒంటె 50 ఏళ్లు. గుర్రం 40 ఏళ్లు. సింహం, జింక 35 ఏళ్లు. గాలాఫాగస్‌ తాబేలు జీవితకాలం 193 ఏళ్లు. చీమ మూడేళ్లు బతుకుతుంది. తేనెటీగ సంవత్సరం జీవిస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు సైతం అంతం ఉంది. పుట్టిన ప్రతీజీవి గిట్టక తప్పదన్నట్లు ఎవ్వరికీ అంటుకోకుండా గాల్లో ఉండే కరోనా వైరస్‌ జీవితకాలం 12 గంటలు. ఈ కాలంలో దీన్ని ఎవ్వరూ ముట్టుకోకుంటే అక్కడికక్కడే చనిపోతుంది. అంటే ఓ 14 గంటల పాటు ప్రజలు ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల కరోనా వైరస్‌ దానికదే నశిస్తుంది. అందుకే ఆదివారం 14 గంటలపాటు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని ప్రభుత్వాలు, అధికారులు ఆదేశాలు జారీచేశారు.  చదవండి: తెలంగాణలో ప్రారంభమైన జనతా కర్ఫ్యూ

అపోహలు.. 
వైరస్‌ను నిర్మూలించడానికి హెలికాప్టర్ల ద్వారా రసాయనాలు చల్లుతున్నారనేది వట్టి పుకార్లు మాత్రమే. మునిసిపాలిటీ వాళ్లు రాత్రుల్లో క్రిమిసంహారక మందులు చల్లుతున్నారని, ఇది శరీరంపై పడితే వ్యాధులు వస్తాయని చెప్పడం నిజంకాదు. జనతాకర్ఫ్యూను పాటించకుండా బయటకు వస్తే మాత్రం.. ఒకవేళ ఎక్కడైరా కరోనా వైరస్‌ ఉంటే అంటువ్యాధిలా వ్యాపించే అవకాశం ఉంది. ఇది గంటల వ్యవధిలో వేలాది మందికి పాకే ప్రమాదం ఉంది. అందకే అందరూ ప్రశాంతంగా ఇంట్లో ఉంటే మంచిదని జనతా కర్ఫ్యూను విధించారు.   

అసలు ఉద్దేశం  
కరోనా వైరస్‌ ప్రస్తుతం మనదేశంలో రెండో దశలో ఉంది. మొదటి దశ విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఈ వైరస్‌ బారినపడడం.. రెండో దశలో విదేశాల నుంచి వచ్చినవాళ్లు తిరిగిన ప్రాంతాల్లో వైరస్‌ గాల్లోనే ఉంటుంది. ఈ దశలో వైరస్‌ను చంపగలిగితే పెద్ద ముప్పు తప్పినట్టు అవుతుంది. కానీ రెండో దశలో కరోనాను చంపకపోతే మూడో దశకు చేరుకుంటుంది. గాల్లో ఉన్న వైరస్‌ మనుషుల్లోకి చేరడం.. వాళ్లు తుమ్మినప్పుడు, దగ్గినపుడు, చేతులు కలిపినపుడు అంటువ్యాధిలా అందరికీ వైరస్‌ పాకడం జరగుతుంది. ఫలితంగా నాలుగో దశలో ఊహించని విధంగా ప్రాణనష్టం జరుగుతుంది. అందకే జనతా కర్ఫ్యూ ద్వారా 14 గంటల పాటు ఇంట్లోనే ఉంటే వైరస్‌కు ఉన్న చైనులింకు లాంటి బంధం తెగిపోతుంది. ఎక్కడికక్కడే అది తుడిచిపెట్టుకునిపోతుంది. ఇదే జనతా కర్ఫ్యూ ప్రధాన ఉద్దేశం.  

మరిన్ని వార్తలు