హైకోర్టు జడ్జీల నియామకాలు పూర్తి

16 Apr, 2017 11:19 IST|Sakshi
హైకోర్టు జడ్జీల నియామకాలు పూర్తి

► 10 రాష్ట్రాలకు 51మంది కేటాయింపు

న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థ మరింత పటిష్టం కానుంది. కేసులను త్వరితగతిన విచారించడానికి సుప్రీంకోర్టు కొలీజియం అధిక సంఖ్యలో హైకోర్టు జడ్జిలను  నియమించింది. పది హైకోర్టులకు 51 మంది జడ్జిలను కేటాయించింది. ఛీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ కెహర్‌ నేతృత్వంలో ప్రముఖ సీనియర్‌ న్యాయమూర్తులు దీపక్‌ మిశ్రా, జె చలమేశ్వర్‌, రంజన్‌ గగోయ్‌, ఎంబీ లోకూర్‌లతో కూడిన కొలీజియం ఈ నియమాకాలను చేపట్టింది. ఈఏడాది మార్చిలోనే కొలీజియం ఈనియామాలకు సంబంధించిన మెమొరాండమ్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ను‌(ఎంఓపీ) ని ఖరారు చేసింది.

ఇందులో అధికంగా ముంబై హైకోర్టుకు 14 మంది, పంజాబ్‌ హర్యానాల ఉమ్మడి హైకోర్టుకు 9 మందిని కేటాయించారు. పాట్నా, ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ ఉమ్మడి హైకోర్టులకు ఆరుగురి చొప్పన నియమించారు. ఢిల్లీ, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాలకు నలుగురి చొప్పున కేటాయించారు. జమ్మూకాశ్మీర్‌కు ముగ్గురు, జార్ఖండ్‌, గౌహతి హైకోర్టులకు ఇద్దరు చొప్పున నియమించారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాట్టాడుతూ జడ్జీల నియామకాలు పారదర్శకంగా జరిగాయని, న్యాయవ్యవస్థలో పారదర్శకత సాధించాలని ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు