‘ఏకీకృత’ ఫైలును రాష్ట్రపతికి పంపండి

15 Jun, 2017 00:55 IST|Sakshi
‘ఏకీకృత’ ఫైలును రాష్ట్రపతికి పంపండి

కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించిన రాజ్‌నాథ్‌ సింగ్‌
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు సంబంధించిన ఫైలును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపా లని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని.. హోంమం త్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదేశించారు. గతంలో ఇదే విషయమై ఏపీ, తెలంగాణ విద్యా శాఖ మంత్రులు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. బుధవారం తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపకుడు బి.మోహన్‌రెడ్డి, అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు కాటే పల్లి జనార్దన్‌రెడ్డి. పూల రవీందర్, ప్రధాన కార్యదర్శి చెన్న కేశవరెడ్డి తదితరులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలసి సర్వీస్‌ రూల్స్‌పై చర్చించారు.

దీంతో వెంకయ్యనాయుడు రాజ్‌నాథ్‌తో సమావే శమై సర్వీస్‌ రూల్స్‌ ఫైలును రాష్ట్రపతి ఆమోదా నికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. దీంతో రాజ్‌నాథ్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని పిలిపించి ఫైలును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఎస్టీయూ నేతలు సోమవారం హోంశాఖ కార్యదర్శి దిలీప్‌కుమార్‌తో సమావేశమై సర్వీసు రూల్స్‌ అమలుపై చర్చించారు. ఏకీకృత సర్వీసు నిబంధనల ఫైలును త్వరలోనే రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు