అయోధ్య తీర్పుపై 6 రివ్యూ పిటిషన్లు

7 Dec, 2019 04:37 IST|Sakshi

న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి.  సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర్‌ ఎంఆర్‌ శంషాద్‌ ద్వారా శుక్రవారం ఈ ఆరు పిటిషన్లు వేశారు.  కాగా, అయోధ్యలో శుక్రవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేశాయి. మసీదుల్లో ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు ప్రశాంతంగా జరిగాయి. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పురస్కరించుకుని ముస్లిం సంస్థలు ఏటా డిసెంబర్‌ 6వ తేదీని బ్లాక్‌ డేగా వ్యవహరిస్తూండగా, హిందువులు శౌర్యదినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు