‘ఏమైనా మాట్లాడితే వాగుడుకాయ అంటారు’

25 Oct, 2018 17:17 IST|Sakshi

న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఈ క్రమంలో తనపై వస్తోన్న విమర్శలకు కాస్తా ఫన్నిగా స్పందించారు స్మృతి. ఈ సందర్భంగా తాను గతంలో నటించిన ‘క్యూంకి.. సాస్‌ భీ కభీ బహు థీ’ సీరియల్‌లోని ఓ ఫోటోను షేర్‌ చేశారు స్మృతి. ఈ ఫోటోలో స్మృతిని తాళ్లతో కట్టేసి ఉంచారు. మాట్లాడటానికి కూడా వీలు లేకుండా నోటిని కూడా మూసేశారు.

#hum bolega to bologe ki bolta hai... 😂🤔🤦‍♀️

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

ఈ ఫోటోకు స్మృతి ‘నేను ఏమైనా మాట్లాడితే మళ్లీ వాగుడుకాయ అంటారు’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ లైన్‌ 1974లో వచ్చిన కిషోర్‌ కుమార్‌ సినిమాలోని ఓ పాటలోనిది. ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘మిమ్మల్ని మీరు తగ్గించుకోని మీ మీద మీరే జోకులు వేసుకుంటున్నారు. నిజంగా మీరు గ్రేట్‌ మేడమ్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు