సోనియా, రాహుల్ కోర్టుకు హాజరు కావాల్సిందే

7 Dec, 2015 15:21 IST|Sakshi

న్యూ ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో సోమవారం చుక్కెదురైంది. ఈ కేసు విచారణ జరుపుతున్న పాటియాలా హౌజ్ కోర్టు ముందు వీరు హాజరు కావాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది.

నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియన్ లిమిటెడ్ కంపెనీ చేజిక్కించుకున్న వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిని విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా పాటియాలా కోర్టు ఆదేశించింది. ఈ కోర్టు ఆదేశాలపై సోనియా, రాహుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పాటియాలా కోర్టు ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.

జవహార్ లాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన విలువైన ఆస్తులను కాజేశారన్న ఆరోపణలతో, బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ మేరకు కాంగ్రెస్ నేతలపై చీటింగ్ కేసు నమోదుచేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనన్నట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు