పాల కల్తీ చేస్తే యావజ్జీవం!

6 Aug, 2016 09:19 IST|Sakshi
పాల కల్తీ చేస్తే యావజ్జీవం!

న్యూఢిల్లీ: పాలు, పాల ఉత్పత్తుల కల్తీపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీని నివారించేందుకు కఠిన చర్యలతో పాటు ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో సవరణలు చేయాలని, శిక్షార్హమైన నేరంగా మార్చాలని సూచించింది.

పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు ఐపీసీలో సవరణలు చేశాయని, పాల కల్తీకి పాల్పడితే జరిమానా, జరిమానా లేకుండా జీవిత ఖైదు విధించేలా చట్టంలో మార్పులు చేశాయంటూ విచారణ సందర్భంగా కోర్టు ఉదహరించింది.
 

మరిన్ని వార్తలు