Earthquake in Kashmir: జమ్మూకశ్మీర్‌లో కంపించిన భూమి

16 Nov, 2023 13:38 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం భయానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి, రోడ్లపైకి చేరారు. 

ఎన్‌సీఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం గురువారం (నవంబర్ 16) ఉదయం 9:34 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కాగా నవంబర్ 4 న నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 70 మందికి పైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, వేలాది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. 

పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు.. స్వల్ప స్థాయి భూకంపాలు భారీ భూకంపానికి సంకేతంగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రకంపనలు తరచూ సంభవించడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. 
ఇది కూడా చదవండి: 19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? 
 

మరిన్ని వార్తలు