ప్రధాని మోదీ మ్యాజిక్ ట్రిక్.. ఫిదా అయిన చిన్నారులు

16 Nov, 2023 13:34 IST|Sakshi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి వచ్చిన కొందరు చిన్నారులను కాయిన్ ట్రిక్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మోదీ "మ్యాజిక్ ట్రిక్" చేశారు. ప్రధాని మోదీ నుదిటికి నాణెం పెట్టుకుంటారు. తల వెనుక భాగంలో తట్టగానే ఆ నాణెం ముందుకు పడిపోతుంది. ఈ దృగ్విశయాన్ని పిల్లలు విస్మయంతో చూశారు. 

పిల్లల నుదిటిపై నాణెం అంటించి వారి తల భాగంలో నొక్కినప్పుడు మాత్రం నాణెం పడిపోదు. ఇదిలాగో తెలియక పిల్లలు విచిత్రంగా చూస్తారు. అయితే.. ఈ క్రమంలో పిల్లల నుదిటిన అంటించిన నాణాన్ని మోదీ మరో చేతితో లాక్కుంటారు. సరదాగా పిల్లలతో ప్రధాని మోదీ పిల్లలతో ఈ మ్యాజిక్ చేశారు.  ఈ విషయాన్ని మరిచిపోలేని జ్ఞాపకాలుగా పేర్కొంటూ ప్రధాని మోదీ ట్విట్టర్‌(ఎక్స్‌)లో షేర్ చేశారు.

ఈ ఏడాది రక్షా బంధన్ వేడుకల్లోనూ ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపారు. పిల్లలు ప్రధానికి ఘనస్వాగతం పలికి రాఖీ కట్టారు. అఖిల భారతీయ శిక్షా సమాగమ్‌ వేడుకలో భాగంగా కూడా ప్రధాని మోదీ పిల్లలతో ముచ్చటించారు. పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఇదీ చదవండి: జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట!

మరిన్ని వార్తలు