తాజ్‌ వద్ద నమాజ్‌ వద్దు: సుప్రీంకోర్టు

9 Jul, 2018 17:13 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘తాజ్‌మహల్‌ ఏడో ప్రపంచ వింత.. కాబట్టి ఇక మీదట అక్కడ వద్ద నమాజ్‌ చేయరాద’ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది, జనవరి 24న ఆగ్రా జిల్లా అదనపు కోర్టు.. ‘ఇకమీదట స్థానికులు మాత్రమే తాజ్‌మహల్‌ వద్ద ప్రార్ధనలు చేయాలి.. స్థానికేతరులకు తాజ్‌ వద్ద నమాజ్‌ చేసేందుకు అనుమతి లేదం’టూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఆగ్రా ఏడీఎమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తాజ్‌మహల్‌ వద్ద స్థానికేతరులు నమాజ్‌ చేయరాదని స్పష్టం చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ వద్దకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారని, భద్రత దృష్ట్యా నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని కోర్టు తెలిపింది.

నేటికి ప్రతి శుక్రవారం తాజ్‌మహల్‌ సందర్శనకు యాత్రికులను అనుమతించరు. ఆ రోజున స్థానిక ముస్లింలు తాజ్‌ వద్ద నమాజ్ చేస్తారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశాల ముస్లిం అక్కడకు వచ్చి నమాజ్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు విదేశీ టూరిస్టులు ఏడాది పాటు వస్తుంటారు. భద్రత దృష్ట్యా తాజ్‌ వద్ద స్థానికేతరులు నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు