కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వార్నింగ్

28 Oct, 2016 12:59 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వార్నింగ్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టి కాయలు వేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీసింది. ఇకనైనా ఆ ప్రక్రియ వేగవంతం చేయకుంటే ప్రధాని కార్యాలయ సిబ్బందికి సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. గత తొమ్మిది నెలలుగా కేవలం పేర్లు చెప్పడంతో కేంద్రం పబ్బం గడుపుకుంటుంది తప్ప అపాయింట్మెంట్లు మాత్రం ఎందుకు చేయడం లేదని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీని ప్రశ్నించారు.

న్యాయమూర్తుల నియామకం విషయంలో ప్రతిష్టంభన మంచిదికాదని చెప్పారు. కొలీజియం సిఫారసులో అభ్యంతరం ఉంటే ఎందుకు వెనక్కి పంపించడంలేదని ప్రశ్నించారు. అయితే, నియామకాలు ఆలస్యం చేయడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కాదని, ఎంపిక విధానానికి సంబంధించిన ప్రక్రియ ఒకసారి ఖరారైతే న్యాయమూర్తుల నియామక ప్రక్రియ వేగవంతమవుతుందని వివరణ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు