'తాజ్‌మహల్‌.. హిందూ దేవాలయం కాదు'

1 Dec, 2015 15:43 IST|Sakshi
'తాజ్‌మహల్‌.. హిందూ దేవాలయం కాదు'

ప్రేమ ప్రతీకగా పేరొందిన ప్రసిద్ధ కట్టడం తాజ్‌మహల్‌ ఒకప్పుడు హిందూ దేవాలయం కాదని కేంద్రప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. తాజ్‌మహల్‌ హిందూ దేవాలయం అనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ సోమవారం లోక్‌సభలో చెప్పారు. తాజ్‌మహల్‌ ఒకప్పుడు శివాలయమంటూ కోర్టులో ఓ పటిషన్ దాఖలైన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు వివరణ ఇచ్చింది.

తాజ్‌మహల్‌ ఒకప్పుడు హిందూ దేవాలయమని, దాని యాజమాన్యాన్ని ముస్లింల నుంచి హిందువులకు బదలాయించాలని, అక్కడ ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా అడ్డుకోవాలని ఈ దావాలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ గురించి ప్రభుత్వానికి తెలుసనని కేంద్రమంత్రి మహేశ్‌ శర్మ పేర్కొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ కట్టడమైన తాజ్‌మహల్‌ పూర్వకాలంలో శివాలయం అన్న వాదనను భారత పురావస్తు శాఖ కూడా గతంలో కొట్టివేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు