ఇక ఆ ఆలయాల్లోకి వెళ్లాలంటే ధోతి, శారీలతోనే..

31 Dec, 2015 16:38 IST|Sakshi
ఇక ఆ ఆలయాల్లోకి వెళ్లాలంటే ధోతి, శారీలతోనే..

మదురై: తమిళనాడులో పుణ్యక్షేత్రాలను సందర్శించాలని అనుకుంటున్నారా..? అయితే, అంతకంటే ముందే మీరు ఓ పంచె, చొక్కా, పైజామాతో సిద్దమవ్వండి. ఎందుకంటే ఇక అక్కడి ముఖ్యమైన కొన్ని ఆలయాల్లోకి భక్తులు ప్రవేశించాలంటే పురుషులకైతే ఈ వస్త్రాలు తప్పనిసరి. మహిళలకైతే చీరలు, చుడిదార్లు, హాఫ్ శారీతో పావడాయ్ ఉండాలి.

ఈ మేరకు ఇప్పటికే ఆయా ఆలయాల్లో ప్రత్యేక నోటీసులు అంటించారు కూడా. కొన్ని గుర్తించిన ఆలయాల్లోకి ప్రవేశించాలంటే ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనంటూ ఈ నెల ప్రారంభంలో మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఇకపై ఆలయాల్లోకి లుంగీ, బెర్ముడాస్, జీన్స్, టైట్ లెగ్గిన్స్ అనుమతించరు. రామేశ్వరం, మీనాక్షివంటి ఆలయాల్లో ఈ నోటీసులు పెట్టారు.

>
మరిన్ని వార్తలు