అంగట్లో అమ్మడిపై పన్ను

1 Mar, 2016 03:25 IST|Sakshi
అంగట్లో అమ్మడిపై పన్ను

ఆదాయం ఏదైనా ... జర్మనీలో మాత్రం పన్నువాత తప్పదు. దాంతో సులువుగా డబ్బు సంపాదించాలనుకున్న ఆ అమ్మడు చిక్కుల్లో పడింది. జర్మనీకి చెందిన 18 ఏళ్ల పెర్షియా 2009లో తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. ఇటలీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి రూ. 88 లక్షలతో  ఆన్‌లైన్ వేలంలో బిడ్ గెలుచుకున్నాడు. ఇంతలో ఆదాయపు పన్ను అధికారులు ఆమెకు ఊహించని షాకిచ్చారు. లావాదేవీ వ్యభిచారం కిందకి వస్తుందంటూ సగం డబ్బుతీసుకెళ్లిపోయారు. ఆన్‌లైన్ వేలంపై 19 శాతం వ్యాట్‌తో పన్ను వాత పెట్టారు.

వరికి ‘ఉరేశారు’..!
రైతు శ్రేయస్సు కోరేవాడే రాజు.. కానీ, జపాన్ పాలకులు అన్నదాతలను పీల్చిపిప్పి చేశారు. జలపుష్పాలైన చేపలు, రొయ్యలు, పీతలపై పన్నులను పూర్తిగా రద్దుచేసి, వరి ఉత్పత్తులపై మాత్రం ఏకంగా 67 శాతం పన్ను వసూలు చేశాడు జపాన్ చక్రవర్తి హిడెయోషి(1590). రైతులు పండించిన పంటలో మూడింట రెండొంతులు పన్ను కింద రాజుకి సమర్పించాల్సి వచ్చేది. దీంతో అన్నదాతలకు గుప్పెడు గింజలు మాత్రమే మిగిలేవి.

‘చచ్చినా’ వదలను..
పన్నులేసి ప్రజల్ని చంపిన పాలకులు మనకెరుకే! కానీ చచ్చిన తర్వాత కూడా పన్నులేస్తున్నమహానుభావులూ ఉన్నారు. అది కూడా ఎప్పుడో రాజుల కాలంలోకాదు.. మూడు, నాలుగేళ్ల కిందటే సియాటిల్‌లోని కింగ్ కౌంటీలో మరణంపైనా పన్ను అమలు చేయడం మొదలుపెట్టారు. మృతుని బంధువులు ఈ మేరకు వైద్య పరీక్ష అధికారి కార్యాలయంలో 50 డాలర్లు చెల్లించాలి. అప్పుడు మాత్రమే ఆ మృతదేహాన్ని తగులబెట్టాలన్నా, సమాధి చేయాలన్నా అనుమతి లభిస్తుంది. దీన్ని స్థానికంగా అందరూ ‘డెత్ ట్యాక్స్’ అని పిలుస్తుంటారు.

మరిన్ని వార్తలు