పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు

1 Nov, 2023 11:27 IST|Sakshi

దేశీయంగా ఉత్పత్తయ్యే పెట్రోలియం ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్‌(ఏటీఎఫ్‌)పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.9,050 నుంచి రూ.9,800కి పెంచింది. ఈ ధరలు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్‌(ఏటీఎఫ్‌)పై లీటరుపై రూ.1గా ఉన్న విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను తొలగించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని లీటర్‌కు రూ.4 నుంచి రూ.2కు తగ్గించింది.

అయితే కేంద్రం అక్టోబర్ 18న పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.12,100 నుంచి రూ.9,050కి తగ్గించింది. గత ఏడాది జూలైలో ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్ను విధించింది. గ్యాసోలిన్, డీజిల్, విమానయాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగించింది.

మరిన్ని వార్తలు