పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి..

9 Apr, 2016 15:04 IST|Sakshi
పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి..

బలియా: ఉత్తరప్రదేశ్లో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు దళిత యువతి (17)ని పెళ్లి పేరుతో నమ్మించి నెలరోజులకు పైగా అత్యాచారం చేశాడు.  పోలీసులు బాధితురాలిని రక్షించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

రాహుల్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని బాధితురాలిని జాన్సీకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో ఉంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోకుండా ఆమెను మోసం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలించారు. జాన్సీలో బాధితురాలిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు