ప్రభుత్వ ఏర్పాటులో ఆయనే కీలకం..

16 May, 2019 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకోవడంతో కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ, యూపీఏ పక్షాలు ముందస్తు కసరత్తుకు తెరలేపాయి. యూపీఏ పక్షాలను ఏకం చేయడంతో పాటు బీజేపీయేతర పార్టీలను కలుపుకుపోవాలని ఓవైపు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా, విస్పష్ట మెజారిటీ దక్కకుంటే ఎన్డీఏ పక్షాలతో కలిసి సర్కార్‌ ఏర్పాటుపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ కీలక పాత్ర పోషిస్తారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదని, కేంద్రంలో ఈసారి బీజేపీయేతర, ఎన్డీయేతర ప్రభుత్వం కొలువుతీరుతుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు తుదిదశకు చేరిన క్రమంలో తాను దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన అనంతరం ఈ మాట చెబుతున్నానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు