ప్రాణాలు తీసిన పులి..

30 Aug, 2016 21:13 IST|Sakshi
ప్రాణాలు తీసిన పులి..

ఉత్తర ప్రదేశ్ వాసుల్ని పులల బెడద వీడటం లేదు. తాజాగా మైలాని రేంజ్  ప్రాంతంలో  50 ఏళ్ళ మరో వ్యక్తి  పులి దాడికి బలై పోయాడు. ఛెడి పూర్ గ్రామంలో పంటపొలంలో పని చేసుకుంటున్న జానకీ ప్రసాద్ ను అమాంతంగా వచ్చిన పులి పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్ళి  చంపినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రసాద్ అరుపులు విన్న స్థానికులు.. పులి బారినుంచీ అతడ్ని రక్షించేందుకు దాన్ని వెంబడించినా ఉపయోగం లేకపోయింది. ప్రసాద్ ను నోట కరచుకొని ఈడ్చుకుంటూ దగ్గరలోని అడవుల్లోకి పారిపోయింది.

లఖింపూర్ ప్రాంతంలో ఇలా పులులు మనుషులపై దాడి చేసి, ప్రాణాలు తీయడం ఇదే మొదటి సారి కాదని, ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ ఇది నాలుగోసారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసాద్ మరణంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు.. ఎప్పుడూ బిజీగా ఉండే గోలా ఖుతార్ రోడ్డుపై బైఠాయించి, అటవీ అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళకు దిగారు. రహదారి మార్గంలో నిరసన వ్యక్తం చేయడంతో తీవ్రంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 14 ఏళ్ళ సరస్వతి, 59 ఏళ్ళ తికారామ్, 60 ఏళ్ళ బాబూరామ్ ఇటీవల పులుల దాడిలో చనిపోయారు.

మరిన్ని వార్తలు