రైల్వేల్లో మార్పు ప్రతిబింబించాలి

19 Nov, 2016 03:36 IST|Sakshi
రైల్వేల్లో మార్పు ప్రతిబింబించాలి

రాజకీయాలకు అతీతంగానే రైల్వే బడ్జెట్ తొలగింపు: మోదీ
 
 న్యూఢిల్లీ: రైల్వే శాఖ కొత్త వేగం, పురోగతి, కొత్త సామర్‌థ్యన్ని అందుకుని.. ఈ శతాబ్దపు మార్పును ప్రతిబింబింపజేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ శివార్లలోని సూరజ్‌కుండ్‌లో నిర్వహించిన ‘రైల్వే వికాస్ శిబిర్’లో పాల్గొన్న రైల్వే ఉద్యోగులనుద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్‌‌సలో ప్రసంగించారు. దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు మోదీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొత్త వేగంతో రైల్వేశాఖ పరుగులు తీయాలని సూచించారు. 92 ఏళ్ల రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని రాజకీయాలకు అతీతంగానే (ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా) ధైర్యంగా నిర్ణయం తీసుకుని రద్దుచేసినట్లు వెల్లడించారు. ‘చిన్నప్పటినుంచి రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మిన నాకు.. రైల్వేలతో మరపురాని అనుబంధం ఉంది.

దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థను చాలా దగ్గరినుంచి చూశాను. ఆ శతాబ్దం మారింది. రైల్వేల్లోనూ మార్పు రావాలి. కొత్త శతాబ్దంలో సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత బలమైన వ్యవస్థగా రైల్వేలు ఎదగాలి’అని ప్రధాని అన్నారు. రైల్వేల అభ్యున్నతికి సంస్థ ఉద్యోగుల చిత్తశుద్ధే కారణమన్నారు. చిన్న స్థారుు రైల్వే ఉద్యోగి కూడా తన కుమారుడు ఉన్నత శిఖరాలకు చేరేలా ఆశించాలన్నారు. రైల్వేల పనితీరులో మార్పులు తీసుకొచ్చి ఉద్యోగుల మధ్య ఓ కుటుంబ వాతావరణం ఏర్పర్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు