సొరంగంలో ఆగిపోయిన రైలు!!

16 Jul, 2014 10:50 IST|Sakshi
కట్రా రైలును ప్రారంభిస్తున్న మోడీ (ఫైల్)

జమ్ము కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు బేస్ క్యాంపు అయిన కట్రాకు వెళ్లేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన రైలు ఇంజన్ చెడిపోయి.. సొరంగం మధ్యలో ఆగిపోయింది. అలా దాదాపు గంట పాటు రైలు కట్రా రైల్వేస్టేషన్కు సమీపంలో ఆగిపోయింది. మొత్తం ఏసీ ఉన్న ఈ శ్రీశక్తి ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి కట్రా వెళ్తుంది. మరో ఐదు కిలోమీటర్లు వెళ్తే స్టేషన్ వచ్చేస్తుందనగా సొరంగంలో గంటపాటు రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

తెల్లవారుజామున 5.10 గంటలకు రైలు కట్రా చేరాల్సి ఉండగా, ఉదయం 7 గంటలకు వచ్చినట్లు ఫిరోజ్పూర్ డీఆర్ఎం ఎన్సీ గోయల్ తెలిపారు. కట్రా రైలును ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సొరంగంలో ఆగిపోయిన రైలును మళ్లీ తీసుకెళ్లేందుకు హుటాహుటిన ఉధంపూర్ నుంచి మరో ఇంజన్ను పంపారు. అప్పటికే అరగంట ఆలస్యంగా నడుస్తున్న రైలు, ఈ సంఘటనతో మరో గంట ఆలస్యమొంది.

మరిన్ని వార్తలు