బ్రేకింగ్‌: కుప్పకూలిన ఫ్లైఓవర్‌

11 Aug, 2018 10:11 IST|Sakshi
కుప్పకూలిన ఫ్లై ఓవర్‌

లక్నో : నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ శనివారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్‌, బస్తీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడు గాయపడ్డాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉదయం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో వర్షం పడుతుండటంతో ఫ్లై ఓవర్‌కు సపోర్ట్‌గా ఉంచిన బీమ్‌లు భూమిలోకి కుంగిపోయాయని దీంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. జాతీయ రహదారి 28పై లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు. ప్రమాదపు సమాచారాన్ని తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 


 

మరిన్ని వార్తలు