Diwali Fair In UP: యోగి సర్కార్‌ దీపావళి కానుక.. వీధి వ్యాపారులకు పండుగే పండుగ!

8 Nov, 2023 09:07 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయాన్ని అందించేందుకు యూపీ ప్రభుత్వం  చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని 75 జిల్లాల్లో నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు దీపావళి మేళా నిర్వహించనున్నారు. పీఎం స్వనిధి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ మేళా జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర పట్టణ జీవనోపాధి మిషన్‌ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. 

సాధారణ పౌరులకు అవసరమయ్యే ఉత్పత్తులను ఒకే చోట అందించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎకె శర్మ తెలిపారు. ఈ మేళాతో వీధి వ్యాపారులకు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం అందుతుందని అన్నారు. ఈ మేళాకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. మేళా జరిగే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. 

దీపావళి సందర్భంగా యోగి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, బోనస్‌ను కానుకగా ఇచ్చింది. అలాగే గృహిణులకు పీఎం ఉజ్వల పథకం కింద రెండు ఉచిత సిలిండర్లను బహుమతిగా అందించింది. ఈ కోవలోనే వీధి వ్యాపారులకు దీపావళి మేళా ద్వారా అదనపు ఆదాయానికి మార్గం చూపింది.
ఇది కూడా చదవండి: అయోధ్య భద్రత ఒక సవాలు: సీఆర్‌పీఎఫ్‌

మరిన్ని వార్తలు