నాటకం వేసిన కేంద్ర మంత్రి

13 Oct, 2018 13:34 IST|Sakshi
రామ్‌లీలా నాటకంలో జనక మహారాజు పాత్రలో కేంద్ర మంత్రి హర్ష వర్ధన్‌

న్యూఢిల్లీ : పట్టు వస్త్రాలు, ఆభరణాలు, కిరీటం, పెద్ద మీసం, రాజులాగా మేకప్‌.. హిందీలో ఏకధాటిగా డైలాగ్‌లు చెబుతూ ప్రేక్షకులను ఆలరించారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్‌. శుక్రవారం ఎర్రకోటలో నిర్వహించిన ‘రామ్‌లీలా’ నాటకంలో, హర్షవర్ధన్‌ మిథిల రాజు జనకుడి వేషం వేశారు. మీసం, మేకప్‌తో డ్రామా ఆర్టిస్ట్‌లాగానే తయారయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ కార్యక్రమంలో జనక మహారాజు వేషంలో పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు.

ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటారు.. గాలి స్వచ్ఛంగా మారితే అది ఆరోగ్యకరమైన జీవనానికి దారితీస్తుందని అన్నారు. కార్యక్రమం ప్రారంభానికే ముందే హర్షవర్ధన్‌ తాను రామ్‌లీలాలో నాటకంలో సీతా దేవి తండ్రి అయిన జనక మహారాజు పాత్ర వేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. హర్షవర్ధన్‌ గతంలో భోజ్‌పురి నటుడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.

మరిన్ని వార్తలు