పాక్‌ ఉగ్ర స్వర్గధామమే: నిక్కీ హేలీ

29 Jun, 2018 03:19 IST|Sakshi
నిక్కీ హేలీ

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ స్వర్గధామంగా మారడాన్ని అమెరికా ఎంతమాత్రం సహించబోదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ అధినాయకత్వానికి అమెరికా ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సంస్థ ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హేలీ మాట్లాడారు. ‘ఉగ్రవాదుల ఏరివేత విషయమై గతంతో పోల్చుకుంటే పాకిస్తాన్‌తో అమెరికా ప్రభుత్వ వైఖరి మారింది. ఇప్పటికైనా పాకిస్తాన్‌ తన వైఖరిని మార్చుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికాలు ప్రపంచానికి నాయకత్వం వహించాలని హేలీ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు