ప్రియా ‘కన్నుగీటు’తో ప్రజల్లో అవగాహన

24 Mar, 2018 17:38 IST|Sakshi

వడోదర : ఒక్క కన్ను గీటుతో మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని ఎంత ఉర్రూతలూగించిందో అందరికీ తెలిసిందే. ఆ కన్నుగీటుతో ఆమెకి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పాపులారిటీని వడోదర సిటీ పోలీసులు, సురక్షితమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడానికి వాడుతున్నారు. ప్రియా ప్రకాశ్‌ కన్ను గీటుతో ఓ క్యాప్షన్‌ పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ‘రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. పరధ్యానంగా లేకుండా జాగ్రత్తగా డ్రైవ్‌ చేయండి. #ట్రాఫిక్‌ఏక్‌సర్కార్‌.. ’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. పోలీసులు క్రియేటివ్‌తో రూపొందించిన ఈ పోస్టర్‌, ప్రస్తుతం వైరల్‌ అయింది.

ఈ మాదిరిగా సందేశాన్ని తెలియజేయడం గొప్ప మార్గమంటూ ట్విటర్‌ యూజర్లు పొగుడుతున్నారు. ‘ఈ వినూత్న బ్యానర్‌ మేము చాలా ప్రేమిస్తున్నాం. అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న వర్క్‌ చాలా అభినందనీయం’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వేధింపులు, వెంబడింపులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఫేమస్‌ 'హసినా మాన్ జాయేగి' పాటను ఉపయోగించింది మరో పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. యువతరాన్ని ఎక్కువగా చేరుకోడానికి అంతకముందు సిటీ పోలీసులు సోషల్‌ మీడియా క్రియేటివిటీని వాడారు. ఇటీవల వడోదర, ముంబై పోలీసు, బెంగళూరు పోలీసులు ఆకట్టుకునే పదబంధాలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు