వరవరరావును నానావతి ఆస్పత్రికి తరలించిన పోలీసులు

19 Jul, 2020 10:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును పోలీసులు నానావతి ఆస‍్పత్రికి తరలించారు. శనివారం రోజున ఆయనను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించాలని, అందుకయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో 80 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో, కరోనా వైరస్‌ బారిపడిన ఆయనను శనివారం అర్ధరాత్రి సమయంలో నానావతి హాస్పిటల్‌కు తరలించినట్లు సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. (మౌనం ఒక యుద్ధ నేరం)

కాగా.. మహారాష్ట్రలోని తలోజా జైలులో భీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా వరవరరావు ఏడాదిన్నరగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబయిలోని జేజే ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ ఆయనకు జరిపిన కోవిడ్‌ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనకు కోవిడ్‌ చికిత్సను అందించడానికి ముంబైలోని నానావతి ఆస్సత్రికి తరలించారు. (‘వీవీ విడుదలకు జోక్యం చేసుకోండి’)

మరిన్ని వార్తలు