'చంద్రబాబు వ్యాఖ్యలు గాయపరిచాయి'

26 May, 2016 15:51 IST|Sakshi
'చంద్రబాబు వ్యాఖ్యలు గాయపరిచాయి'

ఢిల్లీ: పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందర్నీ గాయపరిచాయని, దీనిపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారని చెప్పడం అమానుషమన్నారు. మన రాష్ట్ర గవర్నర్ తరచు దేవాలయాలకు వెళ్తున్నారు?, దానికి చంద్రబాబు ఏమి చెప్తారని ప్రశ్నించారు. అయ్యప్ప భక్తులను అవమానపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడరని వీహెచ్ ఆరోపించారు.  ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

 

ఇదిలాఉండగా, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంప్రదాయాన్ని పాటించాలన్నారు. గతంలో కేశవరావుకు మద్దతిచ్చి రాజ్యసబ ఎన్నికల్లో గెలిపించామని, ఈసారి కాంగ్రెస్కు టీఆర్ఎస్ మద్దతివ్వాలని వీహెచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి ఎన్నికల్లో రాజ్యసభ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఒకవేళ సోనియా అవకాశమిస్తే పోటీకి దిగుతానని వీహెచ్ తెలిపారు.

మరిన్ని వార్తలు