వైరల్‌ వీడియో.. ముంబై నడిబొడ్డులో జింకల విహారం

6 Jul, 2020 15:32 IST|Sakshi

ముంబై: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా మనుషులంతా ఇళ్లకే పరిమితయ్యారు. వాహనల రోద, కాలుష్యం తగ్గింది. దాంతో ప్రకృతి తనకు తానే చికిత్స చేసుకుంటూ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెటిజనులను తెగ ఆకట్టుకుంటోంది. ఉరుకులుపరుగులతో ఉండే ముంబై మహానగరంలో మనుషులు, వాహనాలు తప్ప జంతువులు మచ్చుకు కూడా కనిపింవు. ఒకవేళా కనిపించినా ఒకటి అరా తప్ప గుంపులుగా కనిపించడం అనేది అత్యంత అరుదు. ఈ క్రమంలో ముంబైలోని మిథి నది చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతున్న జింకల గుంపుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ముంబైకి చెందిన న్యాయవాది, పర్యావరణవేత్త ఆఫ్రోజ్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. (ఆమెపై పెరిగిన వివక్ష)

ఈ క్రమంలో ఆఫ్రోజ్‌ షా ‘లాక్‌డౌన్‌ వల్ల జరిగిన మేలు.. ముంబై మహానగరం మిథి నది పరిసర ప్రాంతాల్లో జూలై 2 సాయంత్రం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గతంలో మేం ఎక్కడైతే మిథి నది శుభ్రత కార్యక్రమం ప్రారంభించామో.. ఇప్పడు అక్కడే ఈ జింకల గుంపు స్వేచ్ఛగా విహరిస్తోంది. ప్రకృతి మాతను ఒంటరిగా వదిలేస్తే.. తనకు తానే చికిత్స చేసుకుంటుంది’ అంటూ ఈ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. లాయర్‌గా పని చేసిన ఆఫ్రోజ్‌ తొలుత 2015లో వెర్సొవా బీచ్‌ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలా కొద్ది కాలంలోనే వేలాది మంది వాలంటీర్లతో దేశంలోకెల్లా అతిపెద్ద కమ్యూనిటీ క్లీన్‌ అప్‌ డ్రైవ్‌ కార్యక్రమంగా మారింది. (తీపిగుర్తులు.. చేదు బతుకులు)

మరిన్ని వార్తలు