భారతీయులు డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్‌!

6 Jul, 2020 15:30 IST|Sakshi

బీజింగ్‌: దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భద్రతకు ముప్పుగా ఉన్నాయనే కారణంతో 59 చైనా యాప్స్‌ను భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే. వీటిలో షార్ట్‌ వీడియోస్‌ తీసుకోవడానికి ఉపయోగపడే టిక్‌టాక్‌ ఒకటి. చాలా మంది ఈ టిక్‌టాక్‌ ద్వారా వీడియోలు తీసి పాపులారిటి సంపాదించుకున్నారు. టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించిన ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ మేయర్‌  మాట్లాడుతూ, చైనా ఎప్పుడు భారతీయులు డేటా గురించి అడగలేదని, దీనికి సంబంధించి కంపెనీకి ఎప్పుడూ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపారు.  ( చైనా.. యాప్స్‌.. ఓ సర్వే) 


అయితే భారతీయులకు సంబంధించిన డేటా అంతా సింగపూర్‌లో ఉన్న సర్వర్లలో ఉందని టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ లిమిటెడ్‌ తెలిపింది. అలాగే ఈ సంస్థ భారతదేశంలోనూ డేటా సెంటర్లను నిర్మించాలనుకుంటుందని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ మేయర్‌ లేఖ ద్వారా ఇండియా కు తెలిపారు. (‘బ్యాన్‌ టిక్‌టాక్’‌ అమెరికాలోనూ..!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు