ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని ఫోన్

8 May, 2020 02:09 IST|Sakshi

మోదీకి ప్రమాద వివరాలను వివరించిన వైఎస్‌ జగన్‌  

అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ 

సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేసి విశాఖ ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద తీవ్రత, చేపట్టిన సహాయక చర్యలను సీఎం జగన్‌ ప్రధానికి వివరించారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారని, అన్ని విధాల అండగా నిలిచి సహాయం చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది.

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఎన్‌డీఎంఏ అధికారులతో చర్చించానని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నానని ప్రధాని మోదీ కూడా ట్వీట్‌ చేశారు. విశాఖ ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్‌డీఎంఏ అధికారులతో ప్రధాని సమావేశం అనంతరం.. ఆయన ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. విశాఖకు నిపుణుల బృందాన్ని పంపాలని అధికారులకు మిశ్రా సూచించారు. గవర్నర్‌ హరిచందన్‌ కూడా సీఎంకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు.  చదవండి: విశాఖ ఘటనపై కేసీఆర్‌ దిగ్భ్రాంతి

మరిన్ని వార్తలు