అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియమ్!

9 Jun, 2016 19:57 IST|Sakshi
అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియమ్!

అతి పెద్ద వస్తు ప్రదర్శన శాలగా పేరొందిన ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మ్యూజియం ఇప్పుడు అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియంగా కూడ పేరు తెచ్చుకుంది. ప్రాచీన కళలు, పురాతన వస్తువులతోపాటు, చరిత్రకు సంబంధించిన వస్తు ప్రదర్శనతో ఆకట్టుకునే మ్యూజియం  పర్యావరణ పరిరక్షణలోనూ తనదైన పాత్ర పోషిస్తోంది.

ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియంగా కూడ పేరు తెచ్చుకుంది. కళలు, పురాతన వస్తువులు, చరిత్రకు సంబంధించిన మూడు విభాగాలతో సుమారు 50 వేల వరకూ వస్తువులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్నాయి. మొత్తం 140 సోలార్ ప్యానెళ్ళు, కలిగిన మ్యూజియంలో సౌర శక్తి ద్వారా ఇక్కడ నెలకు  సుమారు 35 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. అలాగే వర్షపునీరు నిల్వ ఉంచడంలోనూ మ్యూజియం ముందు వరుసలో ఉంది. 2008 లో ఈ వస్తు ప్రదర్శనశాలలో ప్రారంభించిన వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా సంవత్సరానికి 24 లక్షల లీటర్ల నీటిని కూడ నిల్వ చేయగల్గుతున్నారు.

మరిన్ని వార్తలు