భార్యతో తెగదెంపులు: ఇప్పటికే రూ. 1500 కోట్లు మటాష్‌!

22 Nov, 2023 15:09 IST|Sakshi

రేమండ్‌ అధినేత, బిలియనీర్‌ గౌతమ్‌ సింఘానియా భార్యతో, విభేదాలు, విడాకులు అంశం వార్తలకెక్కింది  మొదలు రేమాండ్‌ సంపద భారీగా  కుప్పకూలింది. దాదాపు 1500కోట్ల రూపాయలను  సంస్థ కోల్పోయింది.  32 ఏళ్ల తమ  వైవాహిక జీవితానికి స్వస్తి అంటూ తన భార్య నవాజ్ సింఘానియాతో విడిపోతున్నట్లు సింఘానియా ప్రకటించిన సంగతి తెలిసిందే.  భౌతిక దాడికి పాల్పడ్డారని బోర్డు మీటింగ్స్‌లో మాట్లాడనీయలేదని నవాజ్‌ మోడీ ఆరోపణల నేపథ్యంలో వివాదం నడుస్తోంది. అటు ఇద్దరు కుమార్తెల ప్రయోజనాలు, కుటుంబ గౌరవం నేపథ్యంలో తన గోప్యతను గౌరవించాలంటూ సింఘానియా మౌనం పాటిస్తుండటం గమనార్హం.

ప్రపంచంలోనే అతిపెద్ద సూట్ ఫాబ్రిక్ ఉత్పత్తిదారులలో ఒకటైన రేమండ్ లిమిటెడ్  ఛైర్మన్ గౌతమ్ సింఘానియా వివాదం నేపథ్యంలో పెట్టుబడిదారులలో ఆందోళన నెలకొంది. దీంతో వరుసగా ఏడో రోజు కూడా భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు షేర్లు 4.4శాతం కుప్పకూలాయి. నవంబర్ 13 నుండి షేరు మొత్తంగా  12శాతం పతనమైంది.  నవాజ్‌ మోడీ కూడా బోర్డు సభ్యురాలు కాబట్టి ఇది కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్య అనీ,  ఇది కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదని  ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్ విశ్లేషకుడు వరుణ్ సింగ్ అన్నారు. 

రూ.11,658 కోట్ల నెట్‌వర్త్‌
మరోవైపు సెటిల్‌మెంట్‌లో భాగంగా నవాజ్‌ మోడీ  1.4 బిలియన్‌ డాలర్ల సంపదలో 75శాతం  ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.అయితే దీనిపై ఆ రేమండ్ గ్రూప్ ప్రతినిధి  ఇంకా అధికారికంగా  స్పందించలేదు.  రేమండ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,658 కోట్లు.  రేమండ్‌ వ్యాపారంలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్‌ వాటానే ఎక్కువ. దక్షిణ ముంబైలోని జేకే హౌస్ ఆస్తి అత్యంత విలువైందిగా అంచనా. దీని విలువ దాదాపు రూ. 6,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతోపాటు లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్‌లెగ్గేరా, లంబోర్ఘిని ముర్సిలాగో, లోటస్ ఎలిస్ కన్వర్టిబుల్, నిస్సాన్ స్కైలైన్ GTR, హోండా S2000, ఫెరారీ 458 ఇటాలియా, ఆడి క్యూ7 లగ్జరీ  కార్లు కూడా సింఘానియా సొంతం. 

మరిన్ని వార్తలు