మత దురభిమానాన్ని సహించం: మోదీ

17 Feb, 2015 15:01 IST|Sakshi
మత దురభిమానాన్ని సహించం: మోదీ

ఢిల్లీ: గత రెండు నెలలుగా ఢిల్లీలోని  చర్చిలపై దాడులు, విధ్వంసం జరుగుతున్నా నోరువిప్పని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొట్టమొదటి సారిగా స్పందించారు. మంగళవారం ఉదయం జరిగిన ఇద్దరు భారతీయుల సెయింట్ హుడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన చర్చిపై దాడి ఘటనను ఖండిస్తూ మాట్లాడారు. తమ ప్రభుత్వం మత దురభిమానాన్ని ఎంతమాత్రం సహించదన్నారు. అలాంటి దురాగతాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు  తీసుకుంటామని హెచ్చరించారు. సెయింట్ హుడ్ ల  జీవితం ఒక్క క్రిస్టియన్లకే కాకుండా  మనుషులందరికీ  ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. మతం వ్యక్తిగత విషయమనీ, మత స్వేచ్ఛను తమ ప్రభుత్వం గౌరవిస్తుందంటూ, మతసహనం భారతీయుల డీఎన్ఎ లో ఉండాలన్నారు. అంతేకాదు భారతదేశంలో ప్రతీపౌరుడికీ తనకిష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ఉందన్నారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలని అన్ని మతాలవారికి ప్రధాని విజ్ఙప్తి చేశారు.

ఈ సందర్శంగా  క్రిస్టియన్ లీడర్లు మాట్లాడుతూ  ప్రధాని మోదీకి తమ మద్దతు ఉంటుదని హామీ ఇచ్చారు.ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి చర్చిపై దాడులు, విధ్వంసం ఘటనలు కూడా ఒక కారణం అన్నవార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని క్రిస్టియన్ బిషప్
లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవ్వడం, తొలిసారి  మతసహనాన్ని పాటించమంటూ వ్యాఖ్యానించడం  ప్రాధాన్యం
సంతరించుకుంది.

మరిన్ని వార్తలు