ఈ పెళ్లి కూతురు ఫొటో తెగ వైరల్‌ అవుతోంది

6 Jun, 2017 19:50 IST|Sakshi
ఈ పెళ్లి కూతురు ఫొటో తెగ వైరల్‌ అవుతోంది

తిరువనంతపురం: రాజకీయ నాయకుల ఇళ్లల్లో జరిగే వివాహాలు నలుగురి దృష్టిని ఆకర్షించడం కొత్తేమి కాదు. వామపక్ష నేతల ఇళ్లల్లో పెళ్లిళ్లలో దాదాపు ఆర్బాటాలు కాస్త తక్కువగానే కనిపిస్తుంటాయి. కానీ, కేరళలో ఓ వామపక్ష నేత కూతురు పెళ్లి మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌ మీడియాలో అది కాస్త వైరల్‌ అయ్యి కూర్చుంది. ఎందుకంటే ఆమె ధరించిన నగలు ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌గా మారాయి. సీపీఐ ఎమ్మెల్యే గీతా గోపి కుమార్తె పెళ్లి గత ఆదివారం త్రిశూర్‌లో జరిగింది.

అయితే, ఆయన కూతురు పెళ్లి సందర్భంగా నిండుగా ధరించిన ఆభరణాలతో కూడిన ఫొటో ఒకటి బయటకు రాగా ఇప్పుడు పెద్ద మొత్తంలో చర్చ మొదలైంది. రెండు సార్లు సీపీఐ తరుపున ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన గోపి కూతురు ఇలా పెళ్లి వేడుకలో పూర్తిగా బంగారంతో దర్శనం ఇవ్వడం ఎలా సాధ్యం అయిందంటూ పార్టీలో ఉన్నత స్థాయి చర్చతో వైరల్‌ అవుతోంది. కాగా, తన కూతురు అంత బంగారం ధరించడాన్ని సదరు ఎమ్మెల్యే సమర్థించుకున్నారు.

మరిన్ని వార్తలు