ఎమ్మెల్యే కారును ఓవర్ టేక్ చేశారని..

7 Jul, 2015 10:43 IST|Sakshi
ఎమ్మెల్యే కారును ఓవర్ టేక్ చేశారని..

ఆగ్రా: ఎమ్మెల్యే కారును బర్రెలను తీసుకెళ్తున్న ఓ ట్రక్ ఓవర్ టేక్ చేయడం ఆయనకు కోపం తెప్పించింది. స్పీడుగా వెళ్లి ట్రక్ను ఓవర్ టేక్ చేయాల్సిందిగా డ్రైవర్ను ఆదేశించాడు. ఎమ్మెల్యే ట్రక్ను ఆపి అందులో ఉన్న 30 బర్రెలను బయటకు తోలారు. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజ్కుమార్ యాదవ్ చేసిన నిర్వాకమిది.

రాజ్కుమార్ రాజస్థాన్లోని కోటా నుంచి తన నియోజకవర్గం సాదార్కు వెళ్తున్నారు. తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ట్రక్లో ఉన్న బర్రెలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. వీటిని చూసిన గ్రామస్తులు తొలుత ఆశ్చర్యపోయినా, తమకు దొరికినందుకు సంతోషించి ఇళ్లకు తోలుకుపోయారు. యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామాల్లో ప్రతి ఇల్లూ గాలించి బర్రెలను గుర్తించారు. కాగా బర్రెలను కబేళానికి తీసుకెళ్తుంటే ట్రాక్ను ఆపానని, గ్రామస్తులు వాటిని విడిపించారని ఎమ్మెల్యే చెప్పగా..  స్థానిక డైరీకి తీసుకెళ్తున్నామని యజమానులు చెప్పారు. చివరకు ఎమ్మెల్యే, బర్రెల యజమానుల మధ్య రాజీకుదరడంతో కేసును ఉపసంహరించుకున్నారు.

మరిన్ని వార్తలు