మంత్రి పద్మారావుకు ఆస్ట్రేలియాలో ఘనస్వాగతం

1 Apr, 2018 19:36 IST|Sakshi

మెల్‌బోర్న్‌: కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వచ్చిన తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావుకు అక్కడి టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 4 నుంచి 15వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వచ్చిన క్రీడామంత్రి పద్మారావు, శాప్‌ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సెక్రటరీ బూర వెంకటేశం, ఇతర అధికారులకు మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్‌ శాఖ ప్రతినిధులు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, టీఆర్‌ఎస్‌ విక్టోరియా రాష్ట్ర ఇన్‌చార్జి సాయిరాం ఉప్పు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ మనదేశం తరఫున కామన్వెల్త్ క్రీడల్లో 221 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, అందులో 12  మంది తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్ర క్రీడాకారులు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పథకాలు సాధించి, మనదేశం, రాష్ట్రం ప్రతిష్టను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు సాయిప్రసాద్ యాదవ్, ఉదయ్‌సింహరెడ్డి, రామ్‌ప్రసాద్ యాదవ్, ఏల్లూరు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు