సునీల్‌ గావస్కర్‌ నయా ఇన్నింగ్స్‌..

19 Sep, 2019 19:05 IST|Sakshi

చికాగో: ఇప్పటివరకు క్రికెటర్‌గా, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ మాజీ క్రికెటర్‌, పద్మభూషణ్‌ సునీల్‌ గావస్కర్‌.. ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందులో భాగంగా సెప్టెంబర్‌ 15న చికాగోలోని బెన్సన్‌విల్లీ మహాలక్ష్మీ హాల్‌, మానవ్‌ సేవా మందిర్‌లో నిర్వహించిన గ్రీట్‌&మీట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గావస్కర్‌ మట్లాడుతూ.. చిన్న పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు నిర్వహించడానికి తను హార్ట్‌టుహార్ట్‌ ఫౌండేషన్‌ కృషి చేస్తోందని తెలిపారు. 

ఈ ఫౌండేషన్‌ సాయి సంజీవని హాస్పిటల్స్‌ భాగస్వామ్యంతో ఇప్పటికీ 775 సర‍్జరీలు చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఏడాదిలో 5000, వచ్చే రెండేళ్లలో పదివేల మంది చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో  అమెరికా తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని ప్రవాస భారతీయులను గావస్కర్‌ కోరారు.

కాగా, సునీల్‌ గావస్కర్‌ వెస్టిండీస్‌పై ఒకే టెస్టు సిరీస్‌లో 774 పరుగులు సాధించారు. దీన్ని 50 సంవత్సరాల తర్వాత తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌లో 774 పరుగులు సాధించి ఆ రికార్డును సమం చేశాడు. అయితే స్మిత్‌ రికార్డు అందుకున్న రోజే హార్ట్‌టుహార్ట్‌ విత్‌ గావస్కర్‌ పౌండేషన్‌ 775 ఉచిత సర్జరీలు పూర్తవడంతో గావస్కర్‌ తన రికార్డును తానే తిరగరాశాడని పలువురు సరదాగా పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు