పీఎన్‌బీ స్కాం: నీరవ్‌ రిమాండ్‌ పొడిగింపు

19 Sep, 2019 18:51 IST|Sakshi

అక్టోబర్‌ 17వరకు రిమాండ్‌

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ (48)కి  మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు.  లండన్‌ వాండ్స్‌వర్త్ జైలు జైల్లో ఉన్న నీరవ్‌మోదీ బెయిల్‌ నిరాకరించి, రిమాండ్‌ను మరో 28 రోజులు పొడిగిస్తూ  కోర్టు  ఆదేశించింది. అక్టోబర్ 17 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతినిస్తూ  వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు  గురువారం  ఆదేశించింది. ఇప్పటికే  మూడుసార్లు బెయిల్ నిరాకరించారు.

కాగా  దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణంగా నిలిచిన పీఎన్‌బీ  స్కాంలో డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ ప్రధాని నిందితుడు. బ్యాంకును సుమారు 13వేల కోట్ల రూపాయలకు పైగా ముంచేసి లండన్‌కు పారిపోయిన నీరవ్‌ మోదీని తిరిగి భారత్‌కు  రప్పించేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో లండన్‌ పోలీసులతో కలిసి నీరవ్‌ను అరెస్ట్‌ చేసింది.  ప్రస్తుతం నీరవ్‌ లండన్‌  జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు