ఆ ‘ఆత్మహత్యలు’ అందరికీ గుణపాఠమే!

26 Apr, 2015 00:36 IST|Sakshi
ఆ ‘ఆత్మహత్యలు’ అందరికీ గుణపాఠమే!

‘దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదమైన జై జవాన్ జై కిసాన్‌ను కాంగ్రెస్ పార్టీ మర్ జవాన్ మర్ కిసాన్ గా మార్చేసింది. గుజరాత్‌లో రైతులు తమ జీవితాలను ముగించుకోవాలని భావించడం లేదు’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ 2014 మార్చి 30న పేర్కొన్నారు. ‘అవినీతిమయమైన, అస మర్థ, జాతివ్యతిరేక’ యూపీఏ పాలన లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు న్న కాలంలో మోదీ వ్యాఖ్య ఇది.


 ‘ఈ సమస్య చాలా పాతది. దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. మన రైతులను ఆత్మహత్యలు చేసుకోనీయవద్దు. గత ప్రభు త్వాలు ఎంతైనా చేసి ఉండవచ్చు కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మనం దీనిపై తీవ్రంగా ఆలోచించి సామూహికం గానే ఒక పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంది’ అని ప్రధాని నరేంద్రమోదీ 2015 ఏప్రిల్ 23న పేర్కొన్నారు. ‘స్వచ్ఛమైన, సమర్థమైన, దేశభక్తియుతమైన’ ఎన్డీయే హ యాంలోనూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న కాలంలో మోదీ ఈ వ్యాఖ్యానం చేశారు.


 తన కళ్లముందే ఒక రైతు దేశ రాజధానిలో ఉరి వేసుకుని చనిపోయిన ఘటన జాతీయ మీడియా దృక్పథాన్ని మార్చి వేసింది. అందుకే ఈ విషాదాన్ని రికార్డు చేసి పదే పదే ఆ ఘటనను ప్రసారం చేస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు ఆత్మహ త్యపై బీజేపీని ఆప్ తప్పు పట్టింది. ఆప్‌ని బీజేపీ తప్పుప ట్టింది. ఆప్, కాంగ్రెస్ రెండూ పరస్పరం ఆరోపించుకు న్నాయి. అయితే దీర్ఘకాలిక పరిణామాలు స్పష్టమే. ఈ సమ స్యను బీజేపీ ఇక ఏమాత్రం విస్మరించలేదు.


 లోక్‌సభలో ఈ సమస్యపై చర్చ జరుగుతున్నప్పుడు, రైతుల ఆత్మహత్యలను రాజకీయం చేయవద్దని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. రాజకీయం చేసిందెవరు? రైతుల ఆత్మహత్యలను ఎన్నికల ప్రచారాంశంగా మార్చిన తర్వాత మోదీ కానీ, బీజేపీ కానీ ప్రస్తుతం దానితో కలసి జీవించాల్సిందే తప్ప దానిపై ఆరోపణలు ఉండకూడదు.


 మిగతా జనాభాతో పోలిస్తే భారతీయ రైతుల ఆత్మహ త్యల రేటు 47 శాతం మేరకు ఉందని ది హిందూ పత్రిక 2013లో పేర్కొంది. 2011లో లక్ష మంది రైతులకుగాను 16.3 శాతం మంది ఆత్మహత్యలు నమోదయ్యాయి. మొత్తం దేశ జనాభాలో ఆత్మహత్యల రేటు 11.1 శాతం మాత్రమే. 1995 నుంచి కనీసం 2,70,940 మంది భారతీయులు ఆత్మ హత్య చేసుకున్నారని ది హిందూ తెలిపింది.

95 నుంచి 2000 వరకు ఆరేళ్లలో సగటున 14,462 మంది రైతులు ఆత్మ హత్యల పాలయ్యారు. 2001 నుంచి 2011 వరకు 11 ఏళ్లలో రైతుల ఆత్మహ త్యల వార్షిక సగటు 16,743గా నమో దైంది. అంటే రోజుకు 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే 2001 నుంచి దాదాపుగా ప్రతి అర్ధగంటకూ ఒక రైతు ఆత్మహత్య పాలవుతున్నట్లు లెక్క.


ఈ లెక్కలు పూర్తి కథను చెప్పక పోవచ్చు. అదే ఏడాది బీబీసీ.. యూఎస్ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించిన ఒక భారీ అధ్యయనాన్ని పేర్కొంటూ 2010 సంవత్సరంలో భారత్‌లో 19 వేల మంది రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని తెలిపింది.
 కాబట్టి మోదీ చెప్పినట్లు ఇది చాలా పాతది, లోతైనది, విస్తృత వ్యాప్తి కలిగినట్టిది. రైతులను చంపుతున్నారంటూ ఇతర ప్రభుత్వాలను నిందించేటప్పుడు మోదీ సైతం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి మరి. ఈ సమస్య కేవలం మనదే కాదు. ఇది అంతర్జాతీయ సమస్య అని న్యూస్‌వీక్ పత్రిక అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, భారత్‌లలో రైతుల ఆత్మహత్యలను పేర్కొంటూ సోదాహరణంగా తెలిపింది.

 
హగ్గింగ్‌టన్ పోస్ట్ విలేకరి టెరెజియా ఫార్కాస్ ఎందు కిలా జరుగుతుందో వివరించారు. ఆర్థిక ఒత్తిళ్లు, పశు వ్యాధు లు, పంటలు సరిగా పండకపోవడం, వాతావరణ మార్పు, ప్రభుత్వ విధానాలు, చట్టాలు మొత్తంగా రైతు జీవితాన్ని ధ్వంసం చేస్తున్నాయి. అధిక ఒత్తిడికి నిరాశా నిస్పృహ తోడై కుంగుబాటుకు దారితీస్తోంది. ఆదుకునే ఆపన్న హస్తాలు లేవని భావించినప్పుడు ఆత్మహత్యే శరణ్యమనే భావన మొదలవుతుంది.


గత డిసెంబర్‌లో మోదీ ప్రభుత్వానికి నిఘా సంస్థ రైతుల ఆత్మహత్యలపై ఒక నివేదిక సమర్పించింది. రైతుల ఆత్మహత్యలకు సహజ కారణాలు, మానవ తప్పిదాలు ప్రధా న కారకాలని ఈ నివేదిక తెలిపింది. అకాల వర్షాలు, పెనుతు పానులు, కరువు, వరదలు వంటివి పంటలను దెబ్బ తీస్తుం డగా, ధరల విధానాలు, మార్కెటింగ్ సౌకర్యాల లేమి అనేవి పంట చేతికొచ్చిన తర్వాత నష్టాలకు కారణమవుతున్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదించింది.


కాబట్టి నిఘా నివేదిక ప్రకారం ఈ పరిస్థితికి ప్రభు త్వాన్నే నిందించాల్సి ఉంటుంది. మోదీ గుణపాఠం నేర్చు కుంటున్నట్లుగానే, జరుగుతున్న పరిణామాల నుంచి ఎవ్వ రూ తప్పించుకోలేరు కూడా.

ఆకార్ పటేల్
 (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత, aakar.patel@icloud.com)

>
మరిన్ని వార్తలు