సెల్ఫీతో బహుపరాక్

3 Jul, 2016 10:25 IST|Sakshi

ప్రముఖులని సెల్ఫీలు ఎలా బోల్తా కొట్టించగలవో చెప్పే ఒక ఘటన ఆ మధ్య పాకిస్తాన్‌లో జరిగింది. ముఫ్తి అబ్దుల్ కావి పాకిస్తాన్‌కు చెందిన అత్యున్నత ధార్మిక పీఠం రయిత్ ఇ హిలాల్ సభ్యుడు. ఆయనతో కలసి వివాదాస్పద మోడల్ ఖాందిల్ బలోచ్ తీసు కున్న మూడు సెల్ఫీలు ఫేస్‌బుక్ పేజీలలో కనిపించ డంతో అబ్దుల్ కావి జాతకమే మారిపోయింది.

ఇంతకీ ఆ ఫొటోతో పాటు కనిపించిన చిత్రాలు, వినిపించిన మాటలు బలోచ్‌కు కావి మంచి మాటలు చెప్పాడనే అనిపిస్తున్నాయి. మోడలింగ్ వదిలిపెట్టి, వివాదాల నుంచి బయటపడి ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలని ఆయన ఆ మోడల్‌కి ఉపదేశించారు. కానీ ఇది చాలామందికి నచ్చలేదు. దీనితో ఆయనను పీఠం నుంచి సస్పెండ్ చేశారు. తన పార్టీ తేహ్రీక్ ఇన్సాఫ్ సభ్యత్వం నుంచి కూడా ఇమ్రాన్‌ఖాన్ ఆ మత పెద్దను సస్పెండ్ చేశారు. ఆమె ఎన్నో విన్నపాలు చేసుకుంటే, ఒక హోటల్‌లో కలుసుకోవడానికి తాను అనుమతించానని కావి డాన్‌న్యూస్‌కి చెప్పారు. కావి అంత మంచి విషయాలేమీ చెప్పలేదంటోందామె.

మరిన్ని వార్తలు