ఆయనొక ప్రశాంత సాగరం

21 Dec, 2014 01:39 IST|Sakshi
డీవీ సుబ్బారావు నిన్న విశాఖలో తుది శ్వాస విడిచారు

విశాఖపట్నం వంటి మారు మూల ప్రాంతం నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రెండుసార్లు అధ్యక్షునిగా ఎన్నికై దేశం దృష్టిని ఆకర్షించినవారు దూర్వాసుల వెంక ట సుబ్బారావు. ఆయన నిబ ద్ధత కలిగిన న్యాయవాది, గొప్ప క్రీడాభిమాని. ఆంధ్రా క్రికెట్ అసోసియేష న్‌కు అధ్యక్షులుగా పనిచేశారు. అంతటి క్రీడాభి మానం, అదిచ్చే క్రీడాస్ఫూర్తి, న్యాయవాద వృత్తి మీద ఆయన పెంచుకున్న సమున్నతాభిప్రాయం ఇటీవల కాలంలో అరుదుగా కనిపిస్తాయి. కానీ ఆయన రాజకీయాలలో ఎదగలేకపోయారు. అంత పరిజ్ఞానం, వక్తృత్వం ఉన్న సుబ్బారావు రాజకీయ జీవితం కేవలం విశాఖ మేయర్ పదవికి పరిమితమైంది. ఆ మేరకు దేశం ఆయన సేవలను వినియోగించులేక పోయిందనే చెప్పాలి. ఆయ నకు జవహర్‌లాల్ నెహ్రూ అంటే ఆరాధన. తెన్నే టి విశ్వనాథంగారంటే ఆపార గౌరవం. అలాంటి విలువల వల్లనే కాబోలు రాజకీయాలలో ఎదు రీదవలసి వచ్చింది. సుబ్బారావుగారి సేవా పరిధి ఎంతో విశాలమైనది. విశాఖ నగరంలోని సేవా సంస్థ ప్రేమ సమాజం, భారతీ గానసభ, రామ కృష్ణా మిషన్, మ్యూజిక్ అకాడెమిలలో సభ్వత్వం నుంచి, భారత క్రికెట్ బృం దానికి మేనేజర్‌గా వ్యవహ రిస్తూ వెస్టిండీస్ పర్యటిం చడం వరకు ఆ పరిధి కనిపిస్తుంది.

  ‘ప్రస్తుత మార్కెట్ ఎకాన మీలో న్యాయం అందించడం అనే ప్రక్రియ చాలా కీలకంగా మారింది. అందుకే ఈ రం గంలో ఉన్నవాళ్లకి చట్టబ ద్ధమైనదే కాకుండా, స్వయం నియంత్రణ కూడా అవస రమవుతోంది’ అనేవారా యన. ఆయన న్యాయవాద వృత్తిని ఎంత గొప్పగా ప్రేమించారంటే, న్యాయ వ్యవస్థ దేశ గౌరవాన్ని పెంపొందించేదిగా, స్ఫూర్తిదాయకమైనదిగా ఉం డాలని ఆశించారు. న్యాయవ్యవస్థకు కింది కోర్టులే వెన్నెముక అని ఆయన విశ్వసించారు. ఇలాంటి అభిప్రాయాలే  వైవీ చంద్రచూడ్, పీఎన్ భగవతి (సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు) జీవన్‌రెడ్డి వంటి న్యాయమూర్తులు, నారిమన్, సోలి సొరాబ్జీ, పరాశరన్, వేణుగోపాల్ వంటి న్యాయకోవిదుల దృష్టిలో సుబ్బారావుగారిని సమున్నతంగా నిలిపాయి. జాతీయ న్యాయ వ్యవస్థ సంస్కరణల ప్రక్రియలోను, న్యాయశాస్త్ర విద్యలో తేవలసిన మార్పుల కోసం జరిగిన ప్రయత్నంలోను సుబ్బారావు తన వంతు కృషి చేసి, భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక స్థానం సంపాదించుకున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యాకు రెండోసారి నాయకత్వం వహించినపుడు ఆయన కొన్ని గోష్టులను ప్రత్యేకంగా నిర్వహిం చారు. దేశం దృష్టిలో న్యాయ వ్యవస్థ విలువ మరింత దిగజారిపోకుండా ఉండేందుకు నిర్వహించినవే అవన్నీ.

 తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టి రామా రావు సుబ్బారావుగారిని పార్టీలో చేర్చుకుని విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా నియమించారు. తరువాత విశాఖ మేయర్‌గా ఎన్నికయ్యారు. విశాఖ నగరానికి ఎంతో వన్నె తెచ్చిన గురజాడ కళాక్షేత్రం, ఉడా పార్క్, అప్పు ఘర్, ఆడిటోరియం సుబ్బారావుగారి ఆలోచనలే. 1991లో డాకర్ (సెనెగల్)లో యునిసెఫ్ నిర్వ హించిన అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు భారత్ నుంచి సుబ్బారావు ఒక్కరినే ఎంపిక చేసిం దంటేనే ఆయన చేసిన కృషి ఎంత విలువైనదో తెలుస్తుంది. భారత క్రికెట్ రంగంతో కూడా సుబ్బారావు గారి అనుబంధం విశేషమైనది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ఆయన చిరకాలం అధ్యక్షునిగా పనిచేశారు. సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో 1997లో భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో ఆడిన ప్పుడు జట్టు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా వ్యవహ రించినవారు సుబ్బారావుగారే. ఆయన నిగర్వి. సుబ్బారావుగారంటే విశాఖపట్నానికి కాలం అందించిన ఒక ప్రశాంత సాగరం.
 (వ్యాసకర్త రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
ప్రొ!! ఎ. ప్రసన్న కుమార్

మరిన్ని వార్తలు