గ్రహం అనుగ్రహం, శుక్రవారం 17, జులై 2015

17 Jul, 2015 02:00 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 17, జులై 2015

శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం,
 దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
 నిజ ఆషాఢ మాసం, తిథి శు.పాడ్యమి ఉ.6.50 వరకు,
 తదుపరి విదియ నక్షత్రం పుష్యమి సా.4.20 వరకు,
 తదుపరి ఆశ్లేష, వర్జ్యం ..లేదు,
 దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.04 వరకు,
 తదుపరి ప.12.31 నుంచి 1.22 వరకు,
 అమృతఘడియలు ఉ.9.30 నుంచి 11.01 వరకు
 సూర్యోదయం    :    5.37
 సూర్యాస్తమయం    :    6.34
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
 కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం.
భవిష్యం
 
మేషం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయటా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకర ంగా ఉంటుంది.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు శుభదాయకం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
సింహం: వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు చేస్తారు. పనుల్లో జాప్యం జరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరగవచ్చు.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.
 
తుల: దూరపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. విందు వినోదాలు చేస్తారు. కార్య జయం కలుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం: బంధువులతో విభేదాలు రావచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు కలిగే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక లాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్తహోదాలు అందుతాయి.

కుంభం: పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చర్చలు సఫలం. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

- సింహంభట్ల సుబ్బారావు
 
 

మరిన్ని వార్తలు