అంతా రాజకీయమే గోవిందా

23 Aug, 2016 22:33 IST|Sakshi
అంతా రాజకీయమే గోవిందా

విశ్లేషణ
ప్రాణాలతో చెలగాటమాడే దహీహండి మతసంబంధమైనదైతే బీజేపీ క్రీడా మంత్రి ఈ సాహస క్రీడకు సహాయపడటానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామనే వారు కాదు. నేడు ఇది మత వేడుకా కాదు క్రీడా కాదు ఉత్త రాజకీయం.

రాజ్‌థాకరే సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ ఈ కృష్ణాష్టమికి దహీహండి (ఉట్లు కొట్టడం) కార్యక్రమాన్ని నిర్వహించే ఉద్దేశంతో ఉన్నట్టుంది. మహారాష్ట్ర ప్రభు త్వం ఒక ఆర్డినెన్సును తెచ్చి కోర్టు ఉత్తర్వులు అమలుకాకుండా చేసి నిర్నిబంధంగా ఈ వేడుక జరిగేలా చూడాలని ఆయనకు అన్న అయ్యే ఉద్ధవ్‌ థాకరే కోరుకుంటున్నారు. ఇద్దరికీ ఎవరి పార్టీ వారికి ఉంది. దీంతో భారతీయ జనతా పార్టీ ఇరకా టంలో పడింది. రాజ్‌థాకరేను ధిక్కారానికి పాల్పడనివ్వ డమా, అసలాయన అలా చట్టాన్ని ఢీకొంటారా అని చూడడమా? లేక శివ సేన కోరినట్టు ఆర్డినెన్సును జారీ చేసి రానున్న పౌర పాలనా సంస్థల ఎన్నికల్లో తన ప్రాబ ల్యాన్ని తగ్గిపోయేలా చేసుకోవడమా? అంగీకరించక పోతే ఈ సమస్యను తన రాజకీయ ప్రత్యర్థి, భాగస్వామిౖ  శివసేనకు అప్పగించేసి తనను దెబ్బతీయనివ్వడమా? ఇదంతా రాజకీయమే.

ఏటా జరిగే దహీహండిలో 18 ఏళ్ల లోపు పిల్లలతో అంచెలంచెలుగా 20 మీటర్ల ఎత్తున నిర్మించే మానవ పిరమిడ్లను అనుమతించరాదని గత వారం సుప్రీం కోర్టు ఆదేశించింది. అందులో పాల్గొనే వారు గాయ పడకుండా ఉండేలా వారి భద్రతకు హామీని కల్పించాల నేదే కోర్టు ఉద్దేశం. అలా చాలా మంది తీవ్రంగా గాయ పడ్డారు, కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు.

హిందీ సినిమా బ్లఫ్‌ మాస్టర్‌లో కథానాయకుడు షమ్మీకపూర్‌ ఈ దహీహండిలో పాల్గొనడం చాలామం దికి గుర్తుండవచ్చు. పెరుగు ముంతను ఎగిరి పట్టుకోవ డమే కీలకం. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఆ పిరమిడ్ల ఎత్తూ, బహుమతిగా లభించే డబ్బు పెరగడమే.
రాజకీయ పార్టీలు దీన్ని హిందూ మత వేడుకగా చూస్తాయి. కృష్ణ భగవానుడు బాలునిగా తనకు అంద కుండా ఉంచిన ఉట్టిలోని వెన్నను మిత్రుల సహాయంతో దొంగిలించిన మాట నిజమే. కానీ ఆ విన్యాసాలు ఎప్పుడూ ప్రాణాలకు లేదా కాళ్లూచేతులకు ముప్పును కలిగించేటంతటి ప్రమాదం అంచున నిలవలేదని సుప్రీం పేర్కొంది. కోర్టు ఆదేశాల పట్ల మండిపడుతున్న వారు దీన్ని మత వ్యవహారాల్లో జోక్యంగా చూస్తున్నారు.

ముంబై, ఠానే తదితర కొన్ని నగరాలలో దహీహండి ఒక పెద్ద కార్యక్రమం. బహి రంగ ప్రదేశాల్లో ఎక్కడికక్కడ వేలాడదీసిన ఉట్లను కొట్టుకుంటూ వచ్చే గోవిందుల బృందాల మధ్య రోడ్లమీద  చిక్కుకుపోకుండా హడా వుడిగా అంతా ఇళ్లకు పరుగులు తీస్తారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం స్థానిక సమా జాల చేతుల్లోంచి రాజకీయ నేతల ట్రస్టుల చేతుల్లోకి పోయింది.
దహీహండి జరిగే స్థలాలను చూస్తే అసలవేమిటో కనువిప్పు అవుతుంది. కొందరు రాజకీయవేత్తలు, ప్రధానంగా బాలీవుడ్‌ తారలు సహా సెలబ్రిటీలు భారీ వేదికలపై దర్శన మిస్తారు. గోవిందులకు లాగే వారికి కూడా హర్ష«ధ్వానాలు పలుకుతారు. చెవులు చిల్లులు పడేలా హిందీ సినిమా పాటలు మోగుతుంటాయి. నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టిని ఆకర్షించే  వేదికగా భావిస్తారు. రెండేళ్ల క్రితం ముంతలను ఎంత ఎత్తున వేలాడదీశారంటే.. 43.79 అడుగుల పిరమిడ్‌ అవసరమైంది. పిల్లలు పాల్గొనడంపై హైకోర్టు నిషేధం తర్వాత కూడా కొన్ని బృందాలు వారిని ఉపయోగిం చాయి. పిల్లలుంటే దిగువ అంచెలలోని వారి భుజాల పైన పడే బరువు తక్కువ అవుతుంది.

ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదు, కోర్టు ధిక్కారం జరగలేదు.
మండళ్లుగా పిలిచే నిర్వాహకులు కోర్టు ఆదేశాల పట్ల తొలుత  అలక వహించారు. విధించిన నిబంధన లకు కట్టుబడే కంటే అసలు కార్యక్రమాన్నే నిలిపి వేస్తామని బెదిరించారు. ఆ వెంటనే పునరాలోచనలో పడ్డారు. బ్రహ్మాండమైన ఈ వేడుకలోని మజాయే లేకుండా పోతుందని వాపోయారు. ఈ విషయంలో మొదట ప్రతిస్పందించినది రాజకీయవేత్తలే. హిందూ మత పెద్దలు లేదా మత సంస్థలు కాదు. గత కొన్నేళ్లుగా దహీహండిని చెరబట్టి రాజకీయవేదికగా మార్చి భద్రత పట్ల ఎవరికీ పట్టింపూ లేని క్రీడగా దాన్ని మార్చేశారన డానికి ఇది స్పష్టమైన సంకేతం. హైకోర్టు ఆదేశించే వరకు ఈ నిర్వాహకులలో ఎవరికీ భద్రత పట్టలేదు.

ఇది పూర్తిగా మతపరమైనదే అయితే ప్రత్యర్థి రాజ కీయవేత్తల మధ్య పోటీ ఉండటానికి వీల్లేదు. ఉదాహర ణకు ఎన్‌సీపీ, శివసేనల నేతలిద్దరు పోటీపడి క్రేన్‌ను ఉపయోగించైనా అతి ఎత్తున ముంతను వేలాడదీయ  డమే. ఇది మత కార్యక్రమమైతే గిన్నిస్‌ లేదా లిమ్కా రికార్డు పుస్తకాల్లో నమోదు చేయించుకోవాలని తహ తహలాడరు. బీజేపీ క్రీడామంత్రి శాసనసభలో దహీ హండి సాహస క్రీడకు సహాయపడటానికి ఒక ప్యానె ల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించేవారే కారు. కోర్టు ఆదేశాల గురించి అంగలారుస్తున్న వారిలో ఎవరూ  అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. నేటి దహీహండి మత వేడుకా కాదు క్రీడా కాదు ఉత్త రాజకీయం.
 

- మహేష్‌ విజాపుర్కార్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

ఈ-మెయిల్‌ : mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు