చరితకు వక్రభాష్యాల వాత

10 May, 2016 02:02 IST|Sakshi
చరితకు వక్రభాష్యాల వాత

రెండో మాట
 
భగత్‌సింగ్ ప్రభృతుల జాతీయవాదపు మొదటి లక్ష్యం జాతీయ విమోచనం. అంటే సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టడంద్వారా, స్వాతంత్య్రం పొందడం. దానితోనే జాతీయ విమోచనం పరిపూర్తి కాదనీ, ఆ దశను అధిగమించి సామాజిక, ఆర్థిక రంగాలలో ‘సోషలిస్టు సమాజ వ్యవస్థ’ను స్థాపించుకోవటమనీ, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థను కాస్తా అంతమొందించడమే తమ లక్ష్యమనీ భగత్‌సింగ్ ప్రకటించాడు. ‘అసెంబ్లీ బాంబు కేసు’ విచారణలోనూ ఇదే చెప్పాడు. కాని నేటి పాలకులు, వారి పార్టీలూ ఎక్కడున్నారు?
 
‘వారు పుస్తకాలు రాయరు, కానీ పుస్తకాల అమ్మకాలనూ వాటి పంపిణీనీ అడ్డుకుంటారు. వారు చలనచిత్రాలను గానీ డాక్యుమెంటరీలను గానీ నిర్మించరు. వాటిని సెన్సార్ చేస్తారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లాంటి సంస్థలను నెలకొల్పలేరు కానీ, ధ్వంసం చేస్తారు. వారు జాతీయవాదానికి నవీన భావాన్ని అందించలేరు గానీ, అదే పదాన్ని వాడుతూ దానికి పూర్తి భిన్నమైన అర్థాన్ని తొడుగుతారు.’
 - ప్రొ. జోయా హసన్ (ఎమిరటస్ ప్రొఫెసర్, జేఎన్‌యూ)

 
భారత స్వాతంత్య్రోద్యమంతో ఎలాంటి క్రియాశీలక సంబంధం లేక పోయినా బీజేపీ-ఆరెస్సెస్ పరివార్ జాతీయత/జాతీయవాదం అనే రెండు మంచి పదాల చాటున విద్యారంగం పైనా, పాఠ్య ప్రణాళికలపైనా సరికొత్త దాడులకు పాల్పడడం విచారకరం. భారత సెక్యులర్ వ్యవస్థకు, రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా చిత్రమైన కొత్త పోకడలు అనుసరిస్తున్నది. సెక్యులర్ భావాలకు విరుద్ధంగా జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించే కార్య క్రమంలో ఉన్నట్టు పలు దఫాలుగా బీజేపీ పరివార్ పాలకులు చేసిన ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.

‘ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్’ (పెంగ్విన్ ప్రచురణ) పుస్తకం మీద లేవదీసిన వివాదం ఇందులో భాగమే. సుప్రసిద్ధ చరిత్రకారులు బిపన్‌చంద్ర ఆధ్వర్యంలో మృదులా ముఖర్జీ, కేఎన్ పణిక్కర్, ఆదిత్య ముఖర్జీ, సుచేతా మహాజన్ ప్రభృతులు 1857-1947 మధ్య సాగిన భారత స్వాతంత్య్రోద్యమం గురించి సాధికారికంగా రాసిన చరిత్రే ఈ పుస్తకం. ఇందులో బీజేపీ-ఆరెస్సెస్‌లకు నచ్చని అంశం ఏమిటి? భగత్‌సింగ్, సూర్యసేన్ (చిట్టగాంగ్ విప్లవకారుడు) వంటి వారిని గ్రంథ కర్తలు ‘విప్లవకర ఉగ్రవాదులు’ (రివల్యూషనరీ టైస్ట్స్) అని ఒక అధ్యా యంలో పేర్కొనడమే!

ఎవరు టైస్టులో తేలితే మంచిది
రివల్యూషనరీ టైస్టులు అన్న పదం వాడడానికి కారణం ఉంది. నిజానికి ఆ పేరుతో ఉన్న అధ్యాయంలో ఈ అంశాన్ని చర్చించారు. టైస్ట్ అన్న పదం వాడడానికి కారణం- భగత్‌సింగ్ వంటివారు పూర్తి విప్లవకారులుగా మారక ముందుటి దశలకు సంబంధించిన ప్రస్తావన ఉండడమే. కేవల వ్యక్తిగత హింసావాదాన్ని నమ్మి, లక్ష్య సాధన కోసం ఆ పథంలో ప్రయా ణించిన దశకు సంబంధించిన అధ్యాయం అది. స్వాతంత్య్రోద్యమం అనేక పాయలుగా సాగింది. అయితే అందరి లక్ష్యం ఒక్కటే- స్వాతంత్య్ర సాధన. ఆ ఉధృతిలో కొందరు కేవల జాతీయవాదులుగానూ, కొందరు టైస్టులు గానూ, తిరుగుబాటుదారులుగానూ పాత్ర వహించారు. మరికొందరు తాత్వి కజీవులుగా, సాత్విక వాదులుగా కర్తవ్యం నిర్వర్తించారు.

కానీ భగత్‌సింగ్ తదితరులపైన టైస్ట్ అన్న ముద్ర వేసిన బ్రిటిష్ పాలకులకు జోహుకుం అన్న హిందుత్వవాదులూ ఉన్నారు. భావస్వేచ్ఛనూ, భిన్నాభిప్రాయాన్నీ సహించలేకపోతూ ‘దేశ ద్రోహం’ ఆరోపణ చేస్తున్న పరివారం టైజాన్ని సమర్థిస్తున్నట్టా? వ్యతిరేకిస్తున్నట్టా? సమర్థించని పక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా పాటుపడుతున్న చింతనాపరులు, హేతు వాదులు దభోల్కర్, పన్సారే (మహారాష్ట్ర), కల్బుర్గి (కర్ణాటక)లను హత్య చేయడానికి కారకులు ఎవరై ఉంటారు? ఇస్లామిక్ టైస్టులకు హేతువాదులూ వ్యతిరేకమే. కాబట్టి దేశీయ టైస్టులు విదేశాలలో దొరకరు. మరి ఆ హంతకులు దేశవాళీ సరుకే అయి ఉండాలి.

ఈనాటికీ జాతిపిత గాంధీజీ హత్యకు కారకుడైన నాథూరాం గాడ్సే ఏ కోవకు చెందిన టైస్టో నామకరణం చేయగలరా? ఇతడి ప్రకటన ‘నేనెందుకు గాంధీని హత్య చేశాను?’ బీజేపీ వచ్చాకనే ఎందుకు వెలుగు చూసినట్టు? గాంధీ నేలకొరిగిన క్షణమే దేశంలో పలుచోట్ల మిఠాయిలు పంచుకున్న వాళ్లు ఎవరు?  ఈ దుర్మార్గం దరిమిలా పటేల్, నెహ్రూ కేవలం పరివార్ పార్టీనే

ఎందుకు నిషేధించవ లసి వచ్చింది?
ఇంతకూ బిపన్‌చంద్ర బృందం ఉపయోగించిన పదం ఉద్దేశం ఏమిటి? టైస్టు పదం నుంచి రివల్యూషనరీ టైస్టులు అని పిలవడానికి కారణం- ఒక పరిణామాన్ని తెలియచేయడానికే. టైస్టులుగా ఉన్నవారు సైద్ధాంతికంగా పరివర్తనా దశలో క్రమంగా సుశిక్షితులై విప్లవకారులుగా ఆవిర్భవించినందువల్లనే ఆ దశకు చరిత్రకారులు ఒక అధ్యాయం కేటా యించారు. మిగతా రచన అంతా వారు వ్యక్తిగత హింస గురించి, ధర్మా గ్రహంలో స్వేచ్ఛాభారతావని ఆవిర్భావం కోసం అసంఘటిత శక్తులుగా అధికార గణం మీద వారు జరిపిన దాడులను, ఆపై ఆంతరంగిక మథనం తరువాత వెన్ను చూపని విప్లవకారులుగా మారిన వైనాన్ని వివరించారు.

ఆమాటకొస్తే, బ్రిటిష్ వాళ్లకి లొంగిపోతూ తనను విడుదల చేయవలసిందిగా కోరుతూ మూడు లేఖలు రాసిన హిందుత్వ సిద్ధాంతవాది సావర్కర్ కూడా ఒకనాటి విప్లవకారుడే. కానీ టైస్టులుగానూ, తీవ్ర మథనం తరువాత విప్లవ కారులుగానూ - అంటే ఏ దశ లోనూ, ఉరితీత వరకు శత్రువుకు లొంగిపోని వారు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్‌లే. మదన్‌లాల్ థింగ్రా వంటివారు కూడా త్యాగాలకు మారుపేరుగా నిలిచారు. స్వరాజ్య ఉద్యమంలో ముందు ఉన్న సంస్థ భారత జాతీయ కాంగ్రెస్. ఇది ‘దేశ ద్రోహుల ఉత్పత్తి కేంద్రం’ అంటూ వ్యాఖ్యానించి గవర్నర్ జనరల్ డఫ్రిన్ (1888) నోటి దురుసు తీర్చుకున్నాడు.

పేరు సరే, భావాల మాటేమిటి?
భగత్‌సింగ్ ప్రభృతులను బ్రిటిష్ పాలకులతో పాటు, కొంతమంది జాతీయ నాయకులు కూడా టైస్టులని అన్నారు. ‘అవును, వారు విప్లవకర ఉగ్రవా దుల’ని కొందరు (రివల్యూషనరీ టైస్టులని) సమర్థించవలసి వచ్చింది! అంటే విప్లవకారులుగా మారిన టైస్టులు. దీనినే తరవాతి అధ్యాయాలలో చరిత్రకారులు హేతుబద్ధంగా వివరించాల్సి వచ్చింది. భగత్‌సింగ్ టైరిస్టుగా ‘ఈశ్వరవాది’, రివల్యూషనరీ సోషలిస్టుగా నిరీశ్వరవాది, హేతువాది. ఈ పరిణామాలని బిపన్‌చంద్ర ప్రభృతులు ఈ గ్రంథంలో వివరించడమే గాకుండా, వారు మరో గ్రంథంలో (‘ది మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా’ 2012. పేజి 455-56) కూడా స్పష్టంగా వివరించగలిగారు. ‘నేనెందుకు నిరీశ్వరవాది/హేతువాదినయ్యాను?’ అన్న భగత్‌సింగ్ రచన బిపన్ రెండవ గ్రంథానికి మరింత ఆధారమైంది. గ్రంథ పరామర్శలో బిపన్‌చంద్ర ఇలా వివరించాడు:
 

‘‘భగత్‌సింగ్ భారత మరో స్వాతంత్య్ర సంగ్రామ యోధులలో విప్లవకర సోషలిస్టులలో ఒకరు కావడమేగాదు, తొలితరం భారత మార్క్సిస్టు మేధా వుల్లో, సిద్ధాంతకర్తలలో ఒకరు. దురదృష్టవశాత్తు ఈ యువ కిశోరం ఎదుగు దలలో ఈ చివరిదశ అజ్ఞాత విశేషంగా మిగిలిపోయింది (యువకుడి గానే ఆయనను ఉరితీశారు). అందుకనే అమాంబాపతు మితవాద/ప్రగతి నిరోధ కులు, ఛాందసులూ, మతవాద శక్తులూ భగత్‌సింగ్, ఆయన సహచరులు చంద్రశేఖర్ ఆజాద్ ప్రభృతుల పేరు ప్రతిష్టలను నిస్సిగ్గుగా వాడుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

భగత్‌సింగ్ రాజకీయ సిద్ధాంత ఆచరణ ఆయన జీవితం కౌమారదశ నుంచే మొగ్గ తొడిగింది. ఆ దశ ఏది? గాంధేయ జాతీయవాదం నుంచి విప్లవకర అరాచక వాదం దిశగా మారుతున్న దశ. కాని 1927-28 నాటికల్లా వ్యక్తిగత సాహసిక చర్యల నుంచి మార్క్సిజం వైపు మళ్లింది. 1925-1928 సంవత్సరాల మధ్య రష్యన్ విప్లవం సోవియెట్ యూనియన్‌పై పుస్తకాలు చదివాడు. తనపై లాహోర్ కుట్ర కేసు విచారణ సందర్భంగా లాహోర్ హైకోర్టులో వాదిస్తూ ఇలా స్పష్టంగా ప్రకటించాడు.

‘‘భావధార అనే ఒరిపిడి రాయిపై సానబెట్టిన కత్తి విప్లవం’’ (ది స్వోర్డ్ ఆఫ్ రివల్యూషన్ ఈజ్ షార్పెన్ ఎట్ ది వెట్‌స్టోన్ ఆఫ్ థాట్) అని నిర్వచించాడు! ఆ పిమ్మట 1928 నాటికి ఆయన, ఆయన అనుచరులూ సోషలిజాన్ని ఆమోదయోగ్యమైన సిద్ధాంతంగా ఆమోదించి ప్రకటించారు. దీని పర్యవసానంగా అవతరించిన ‘హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్’ కాస్తా ‘‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్’గా పరివర్తన చెందింది. ఇంతటి యువ కిశోరం మహా మేధస్సును కర్కశ వలస పాలకులు పెందలాడే తుంచివేయటమే
 మన దేశ ప్రజలకు వాటిల్లిన విషాదకర పరిణామాలకల్లా అత్యంత విషాదకర ఘటన!’’

ఆరాధన కాదు, ఆశయాలను ఆచరించాలి
అంతేగాదు - నిరంతర హేతువాదం మన బాధ్యత, కర్తవ్యం అన్నాడు. కుల, మత తత్వాలు తరచుగా సామ్రాజ్యవాదానికే ఊడిగం చేస్తాయనీ, ఆచరణలో ఇది భారత ప్రజల మధ్య చీలికలు పెట్టడానికేగానీ, వాటి శత్రుత్వం సొంత భారత ప్రజలతోనేగాని, సామ్రాజ్యవాదంపైన కాదనీ, స్వాతంత్య్రానంతరం విదేశీ, స్వదేశీ గుత్త పెట్టుబడి శక్తులే ఉమ్మడిగా ప్రజా బాహుళ్యాన్ని దోచుకునే అవకాశం ఉందనీ - 1928లలోనే జోస్యం చెప్పాడు భగత్‌సింగ్!

మరి అలాంటి భగత్‌సింగ్ విప్లవ భావాలూ, గాంధీజీ సాత్విక ఉద్యమ ధోరణీ నచ్చినందువల్లనే తాజాగా పరివార్ వర్గం వారికి మొదటిసారిగా ఇప్పుడు నివాళులు అర్పిస్తోందా? లేక నేటి అధికార పీఠాల ఉనికి కోసం భగత్‌సింగ్, గాంధీల ఫొటోల చుట్టూ కొత్తగా ప్రదక్షిణ చేయవలసి వస్తోందా?! భగత్ సింగ్ ప్రభృతుల జాతీయవాదపు మొదటి లక్ష్యం జాతీయ విమోచనం. అంటే సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టడం ద్వారా, స్వాతంత్య్రం పొందడం. దాని తోనే జాతీయ విమోచనం పరిపూర్తి కాదనీ, ఆ దశను అధిగమించి సామాజిక ఆర్థిక రంగాలలో ‘సోషలిస్టు సమాజ వ్యవస్థ’ను స్థాపించుకోవటమనీ, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థను కాస్తా అంతమొందించడమే తమ లక్ష్యమనీ భగత్‌సింగ్ ప్రకటించాడు. ‘అసెంబ్లీ బాంబు కేసు’ విచారణలోనూ ఇదే చెప్పాడు. కాని నేటి పాలకులు, వారి పార్టీలూ ఎక్కడున్నారు? ఎక్కడు న్నాయి?! ఈ భావనా స్రవంతికి ‘పరివార్ వర్గం’ చేదోడు వాదోడు అవు తుందా, లేదా అన్నదే నేటి అసలు ప్రశ్న! ముసుగులో గుద్దులాట ఇక అనవ సరం! అవునా, కాదా?!
 
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

>
మరిన్ని వార్తలు