ఎన్సీపీ కీలక నిర్ణయం.. అజిత్‌పై వేటు

23 Nov, 2019 12:46 IST|Sakshi

ఎన్సీపీ ఎల్పీ పదవి నుంచి తొలగింపు

సాక్షి, ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో  ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న అజిత్‌ పవార్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఎన్సీపీ పార్టీ ఆఫీసులో హైడ్రామా నెలకొంది. అజిత్‌కు వ్యతిరేకంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. శరద్‌కు అజిత్‌ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా శరద్‌ పవార్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా అజిత్‌ బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సగం మంది ఎమ్మెల్యేతో పార్టీని చీల్చి బీజేపీతో చేతులు కలిపారు. (ఉత్కంఠగా బలపరీక్ష!)

అయితే ప్రస్తుతం ఆయన వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై త్వరలోనే ఓ అవగహన వచ్చే అవకాశం ఉంది.  అజిత్‌పై శరద్‌ పాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా తాజా పరిణామాలపై చర్చించేందుకు శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యాఠాక్రే, ఎన్సీపీ నేత సుప్రీయా సూలే వైబీ చవాన్‌ భవన్‌కు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు