ఎంపీ ఇంట్లో సోదాలపై స్పందించిన ఈసీ

5 Apr, 2019 18:42 IST|Sakshi
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది(పాత చిత్రం)

అమరావతి: టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఇంట్లో సోదాలపై  ఆంధ్ర ప్రదేశ్‌ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది స్పందించారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామంలోని అన్ని ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఎన్నికల సమయంలో సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇలా చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో మిగిలిన సమస్యాత్మక గ్రామాల్లో సైతం కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తారని తెలిపారు.  పార్టీలకు అతీతంగా కార్డన్‌ సెర్చ్‌లు జరగుతాయని, పోలీసులపై వచ్చిన ఫిర్యాదులన్నీ నిజం కాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.

పార్టీల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణ జరిపించామని, కేవలం నాలుగైదు జిల్లాల నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ప్రతి ఫిర్యాదుపై విచారణ తర్వాత నివేదికలు అందాయని, జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో సమీక్ష చేస్తున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు