ఎన్నికల హామీలు నెరవేర్చాలి

21 Jul, 2018 11:35 IST|Sakshi
జీపుజాతాలో మాట్లాడుతున్న సీపీఐ,  సీపీఎం నాయకులు

కొత్తపట్నం (ప్రకాశం): టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండల  సీపీఎం, సీపీఐ కార్యదర్శిలు సూరిని స్వామిరెడ్డి, పురిణి గోపీ డిమాండ్‌ చేశారు. మండలంలో జీపు జాతాలో భాగంగా సీపీఎం, సీపీఐ ఆధ్యర్యంలో  కొత్తపట్నం బస్టాండ్‌ కూడలీలో శుక్రవారం జీపు జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలైన హామీలు అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయలేదని విమర్శించారు. ఇతర దేశాలు నుంచి నల్ల డబ్బు తీసికొస్తానని చెప్పి  ఒక్క పైసా తీసురాలేదని దుయ్యబట్టారు. ఒంగోలు స్మార్ట్‌ సిటీగా మార్చడం, అర్హులైన పేదలందరికి పక్కా ఇళ్ళు నిర్మించలేదని ధ్వజమెత్తారు.

రిమ్స్‌లో ఖాళీగా ఉన్న 300 పోస్టులు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటున్నారు. రిమ్స్‌ హాస్పిటల్‌లో కావల్సిన మౌలిక వసుతలు కరువయ్యాని విమర్శించారు. స్వామిరెడ్డి మాట్లాడుతూ మండలంలో నాలుగు సంవత్సరాల నుంచి పంటలు పండక కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం పాలకలు పటించుకున్న పాపాన పోలేదన్నారు. పంటలు పండటానికి సాగర్, గుండ్లకమ్మ నుంచి కాలువ తీసికొచ్చి పాదర్తి చెరువుకు, అల్లూరులో ఉన్న చాపాయి, చక్రాయి చెరువుకు కలిపితే పంటలు పండుతాయన్నారు. కొత్తపట్నం బీచ్‌ను పర్యటరంగంగా ఏర్పాటు చేయాలనిన తీర పాంత ప్రజలకు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కిష్టం పిచ్చయ్య, మల్లికార్జున, పట్టపు ప్రకాశం, ఏడుకొండలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు