రెండు రాష్ట్రాల వారధి భద్రాచలం

22 Mar, 2019 09:15 IST|Sakshi

ఖమ్మం జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలను కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిపి తెలంగాణ, ఆం్రధ ప్రాంతాలకు వారధిగా ఉండే భద్రాచలం నియోజకవర్గం 2009 నుంచి రద్దు అయింది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ మూడుసార్లు గెలుపొందగా, సీపీఐ మూడుసార్లు, సీపీఎం ఒకసారి గెలుపొందాయి. గెలుపొందిన వారిలో కమలకుమారి, మిడియం బాబురావు కోస్తాకు చెందినవారు కాగా మిగిలిన వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. కాంగ్రెస్‌ నేత రాధాబాయి ఆనందరావు నాలుగుసార్లు, సీపీఐ నేత సోడె రామయ్య మూడుసార్లు, కాంగ్రెస్‌ నేత కమలకుమారి రెండుసార్లు గెలువగా, టీడీపీ పక్షాన విజయకుమారి ఒకసారి, సీపీఎం తరఫున బాబురావు ఒకసారి గెలుపొందారు. ఇది మొదటి నుంచి ఎస్టీలకు రిజర్వుడ్‌ కావడంతో ఐదుగురు గిరిజన నేతలు పన్నెండు సార్లు గెలుపొందారు. వీరిలో కమలకుమారి కేంద్రంలో మంత్రి పదవి కూడా నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు